Begin typing your search above and press return to search.

కోట్లాది మందిలో నేనూ ఒకడిని.. స్టార్ హీరో ట్వీట్‌

తమిళ సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌ లోని అన్ని భాషల సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు విజయకాంత్‌.

By:  Tupaki Desk   |   4 Dec 2023 6:16 AM GMT
కోట్లాది మందిలో నేనూ ఒకడిని.. స్టార్ హీరో ట్వీట్‌
X

తమిళ సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌ లోని అన్ని భాషల సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు విజయకాంత్‌. సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన విజయకాంత్‌ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన బయటి ప్రపంచం ముందుకు వచ్చి ఏళ్లు గడుస్తోంది. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టు ముట్టాయి.

ఆయన ఆరోగ్యం పై సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారంగా పుకార్లు పుట్టిస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో విజయకాంత్‌ ఆరోగ్యం గురించి జరుగుతున్న పుకార్లకు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చెక్‌ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉంది అన్నట్లుగా వారు క్లారిటీ ఇచ్చారు.

విజయకాంత్‌ అనారోగ్య పరిస్థితి నేపథ్యంలో స్టార్‌ హీరో సూర్య స్పందించాడు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌ లో సూర్య... సోదరుడు విజయ్‌ కాంత్‌ ఆరోగ్యం వెంటనే మెరుగు అవ్వాలని కోరుకునే కోట్లాది మందిలో నేను ఒకడిని. కోట్లాది మంది ప్రార్థనలు తప్పకుండా నెరవేరి ఆయన పూర్తి ఆరోగ్యంతో వస్తాడని సూర్య ఆశాసబావం వ్యక్తం చేశాడు.

హీరో సూర్య తనకు విజయకాంత్‌ పై ఉన్న గౌరవ మర్యాదల నేపథ్యంలో ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను ఫోన్‌ ద్వారా పరామర్శించాడట. తప్పకుండా పూర్తి ఆరోగ్యంతో విజయ్‌ కాంత్‌ తిరిగి వస్తారని కూడా వారితో సూర్య ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడి గురించి స్టార్‌ హీరో అయిన సూర్య అలాంటి వ్యాఖ్యలు చేయడం అభినందనీయం.