Begin typing your search above and press return to search.

15 రోజుల్లో లొంగిపొండి.. సినీ నటి జయప్రదకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

ఇంతకూ ఆమెకు ఇంతటి ఇబ్బందిని తెచ్చి పెట్టిన కేసు వివరాల్లోకి వెళితే.. చెన్నైకు చెందిన రామ్ కుమార్.. రాజ్ బాబులతో కలిసి చెన్నైలోని అన్నాసాలైలో జయప్రద ఒక సినిమా థియేటర్ను నడిపారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:36 AM GMT
15 రోజుల్లో లొంగిపొండి.. సినీ నటి జయప్రదకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
X

సీనియర్ నటి కమ్ పొలిటీషియన్ జయప్రదకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక కేసులో ఆమెకు జైలుశిక్ష విధించిన కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తనకు విధించిన జైలుశిక్షను రద్దు చేయాలని ఆమె కోరగా.. అందుకు సదరు న్యాయస్థానం ఆమె అప్పీల్ ను కొట్టేసింది. అంతేకాదు.. 15 రోజుల్లో కోర్టులో లొంగిపోవాలని.. రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఉదంతం జయప్రదకు షాకింగ్ గా మారిందని చెప్పాలి.

ఇంతకూ ఆమెకు ఇంతటి ఇబ్బందిని తెచ్చి పెట్టిన కేసు వివరాల్లోకి వెళితే.. చెన్నైకు చెందిన రామ్ కుమార్.. రాజ్ బాబులతో కలిసి చెన్నైలోని అన్నాసాలైలో జయప్రద ఒక సినిమా థియేటర్ను నడిపారు. అందులో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపుల్లో తప్పుడు పనులకుపాల్పడ్డారంటూ ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసు విచారణలో.. ఆమె మీద ఆరోపించిన ఆరోపణల్నినిజమని తేల్చిన న్యాయస్థానం ఆమెతో సహా ముగ్గురికి ఆర్నెల్లు జైలుతో పాటు రూ.5వేల జరిమానాను విధిస్తూ ఆగస్టులో తీర్పు వచ్చింది.

దీనిపై అప్పీలుకు వెళ్లారు జయప్రద. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినఆమె అప్పీలుపై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈఎస్ఐకు చెల్లించాల్సిన రూ.37.68 లక్షల మొత్తాన్ని చెల్లించే వీలుందా? అన్న విషయాన్ని ప్రశ్నిస్తూ.. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా జయప్రదను న్యాయస్థానం ఆదేశించింది. దీనికి బదులుగా ఆమె రూ.20 లక్షలు చెల్లిస్తామని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు.

దీనిపై ఈఎస్ఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనల్ని విన్న మద్రాస్ హైకోర్టు.. జయప్రదను పదిహేను రోజుల వ్యవధిలో కోర్టు ఎదుట లొంగిపోవాలని.. రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఆసక్తికర అంశం ఏమంటే.. కోర్టులో తమ తప్పు నిరూపితమై.. తలనొప్పులు ఖాయమన్న విషయం అర్థమవుతున్న వేళ.. దాన్ని సాగదీసుకునే కంటే సెటిల్ చేసుకోవటం మంచిది కదా? జయప్రద స్థాయికి రూ.38 లక్షల మొత్తం పెద్దది కాదు కదా? ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చుకుంటే.. అనవసరమైన తలనొప్పుల నుంచి బయటపడొచ్చు కదా? ఈ లాజిక్ ను జయప్రద ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.