Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎం నియామకం తప్పేమీ కాదన్న సుప్రీం!

దులో భాగంగా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తూ ఆయా ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Feb 2024 1:30 PM GMT
డిప్యూటీ సీఎం నియామకం తప్పేమీ కాదన్న సుప్రీం!
X

సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు.. సమానుల్లో అధికమన్న రీతిలో సముచిత రీతిలో పదవిని ఇవ్వటం మామూలే. ఇందులో భాగంగా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తూ ఆయా ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే.. ఈ తరహాలో ఉప ముఖ్యమంత్రుల్ని నియమించటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందంటూ ఒకరాజకీయ పార్టీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.

డిప్యూటీ సీఎం నియామకం రాజ్యాంగ ఉల్లంఘన కాదన్న సుప్రీం.. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రుల్ని ఎంపిక చేయటాన్నిసవాల్ చేస్తూ పబ్లిక్ పొలిటికల్ పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వటం రాజ్యాంగంలోని నిబంధనల్ని ఉల్లంఘించటమేనని.. దీని ద్వారా రాష్ట్రాలు తప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నాయని పిటిషననర్ ఆరోపించారు.

దీనిపై ఈ రోజు (సోమవారం) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేత్రత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉప ముఖ్యమంత్రులు నియామకం రాజ్యాంగ విరుద్ధం కాదన్న ధర్మాసనం.. "ఒక పార్టీ లేదంటే సంకీర్ణ ప్రభుత్వంలోని సీనియర్ నేతలకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి చాలా రాష్ట్రాలు ఉప ముఖ్యమంత్రిని నియమించే విధానాన్ని అనుసరిస్తుంటాయి. అది కేవలం ఒక పేరు మాత్రమే. డిప్యూటీ సీఎంగా ఎవర్నినియమించినా వారు కేబినెట్ మంత్రి హోదాలోనే ఉంటారు" అని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి మొట్టమొదటి.. అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఉంటారని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రులకు సహాయ సహకారాలు అందించేందుకు సీనియర్లకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకుచాలా రాష్ట్రాలు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తుంటాయని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ ఉప ముఖ్యమంత్రులు ఉన్న సందర్భాలు ఉన్నాయని.. అయితే వారికి కేబినెట్ మంత్రి హోదాలోనే వేతనం.. ఇతరసదుపాయాలు అందిస్తారని పేర్కొంది. తాజా కేసుతో ఉప ముఖ్యమంత్రి నియామకం మీద ఉన్న సందేహాలు తొలిగిపోతాయని చెప్పకతప్పదు.