Begin typing your search above and press return to search.

వివాహేతర సంతానానికి ఆస్తి హక్కు... సుప్రీం కీలక వ్యాఖ్యలు!

అవును... వివాహేతర సంబంధంతో జన్మించిన పిల్లలకు హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా.. ఆస్తిపై హక్కు ఉంటుందా.

By:  Tupaki Desk   |   1 Sep 2023 3:26 PM GMT
వివాహేతర సంతానానికి ఆస్తి హక్కు... సుప్రీం కీలక వ్యాఖ్యలు!
X

సాధారణంగా వివాహేతర సంబంధానికి సంబంధించిన నిత్యం వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. కాకపోతే వాటిలో గరిష్టంగా క్రైం కు సంబంధించిన అంశాలే ఉంటాయి! అక్రమ సంబంధం.. లేదా, వివాహేతర సంబంధం కారణంగా ఎన్నో క్రైం లు జరుగుతుండటం.. ఫలితంగా వారి సంతానం అనాదలుగా మిగులుతుండటం తెలిసిందే.

అయితే ఇలా వివాహేతర సంబంధంతో జన్మించిన సంతానం.. వారికి కలిగే ఆస్తి హక్కులు.. వారికి వర్తించే హిందూ వారసత్వ చట్టం.. మొదలైన అంశాలపై తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... వివాహేతర సంబంధంతో జన్మించిన పిల్లలకు హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా.. ఆస్తిపై హక్కు ఉంటుందా.. లేదా.. అనే అంశంపై దాఖలైన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా వారు కూడా చట్టబద్ధమైన వారసులేనని కోర్టు తెలిపింది.

2011 నుంచి పెండింగ్‌ లో ఉన్న ఈ అభ్యర్థనపై సుప్రీం ఇటీవల విచారణ జరిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. చెల్లుబాటుకాని, లేదా రద్దు చేయదగిన వివాహాల నుంచి పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుందనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.

కాగా... గతంలో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇదే విషయంపై భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా వివాహేతర సంతతికి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది! అయితే తాజాగా సీజేఐ ధర్మాసనం గత అభిప్రాయంతో విభేదించింది.

ఫలితంగా... హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో వివాహేతర సంబంధంతో జన్మించిన పిల్లలకు వాటా పొందే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.