Begin typing your search above and press return to search.

సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు.. అభ్యుర్థుల పాలిట వ‌రమే!

అభ్య‌ర్థులు.. అంద‌రూ ప్ర‌స్తుతం ఉన్న ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు.. ఆస్తులు ఏంట‌నేవి పూర్తిగా వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   9 April 2024 11:30 PM GMT
సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు.. అభ్యుర్థుల పాలిట వ‌రమే!
X

కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ‌.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. దీనిని ఎవ‌రూ ఊహించి కూడా ఉండ‌రు. అన్ని పార్టీల‌కూ.. అంద‌రు అభ్య‌ర్థుల‌కు మేలు చేసేలా ఉన్న తీర్పును.. ముక్త‌కంఠంతో పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఆహ్వానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నారు. ఇంత‌కీ సుప్రీంకోర్టు తీర్పు దేనిగురించంటే.. ఎన్నిక‌ల వేళ‌.. అభ్య‌ర్థులు త‌మ ఆస్తిపాస్తుల‌ను వెల్ల‌డించ‌డంపైనే. అభ్య‌ర్థులు.. అంద‌రూ ప్ర‌స్తుతం ఉన్న ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు.. ఆస్తులు ఏంట‌నేవి పూర్తిగా వెల్ల‌డించారు.

కేవ‌లం అభ్య‌ర్థులే కాదు.. వారి భార్య‌, వివాహం కాక‌పోతే..కుమార్తెలు, కుమారుల‌కు ఉన్న ఆస్తుల‌ను కూడా వెల్ల‌డించాలి. ఎక్క‌డా ఏమీ దాచేందుకు వీల్లేదు. ఒక‌వేళ ఏదైనా ఆస్తులు దాస్తే.. రేపు ప్ర‌త్య‌ర్థి దానిని కోర్టులో స‌వాల్ చేసే అవ‌కాశం కూడా ఉంది. ఫ‌లితంగా అభ్య‌ర్థి గెలిచినా అన‌ర్హుడ‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇదీ.. అస‌లు నిబంధ‌న‌. అయితే.. సుప్రీంకోర్టు తాజాగా దీనిలోనే స‌వ‌ర‌ణ చేస్తూ.. సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. అభ్య‌ర్థులు ఎవ‌రూ పూర్తిగా ఆస్తులకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది.

అంతేకాదు.. కుటుంబ స‌భ్యుల్లోని అంద‌రి ఆస్తుల‌ను కూడా వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. పూర్తిగా వివ‌రించ‌క పోయినా.. పోటీ చేసేందుకు అర్హులేన‌ని.. రేపు దీనిని సాకుగా చూపి.. అన‌ర్హ‌త వేటువేయ‌లేర‌ని కూడా.. తేల్చి చెప్పింది. ఇంకే ముంది.. దాదాపు దేశంలో 1000 మందికి పైగా అభ్యర్థులుకోరుకుంటున్న‌ది ఇదే. ఆస్తులు వెల్ల‌డించేందుకు వీరంతా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో కోర్టు తీర్పు అంద‌రికీ వ‌ర్తించేలా రావ‌డంతో వారు పండ‌గ చేసుకుంటున్నారు.

అస‌లు ఏం జ‌రిగింది?

అరుణాచల్ ప్రదేశ్‌లో ఏపీ మాదిరిగానే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు క‌లిపి జ‌రుగుతున్నాయి. ఇక్క‌డి `తేజ్` అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా క‌రిఖో అనే వ్య‌క్తి పోటీ చేశారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఈయ‌న గెలిచారు. అప్ప‌ట్లో ఈయ‌న‌పై పోటీ చేసిన కాంగ్రెస్ క్యాండిటేడ్ నూనీ త‌యాంగీ ఓడిపోయారు. దీంతో క‌రిఖోపై.. కాంగ్రెస్ అభ్య‌ర్థి కేసు పెట్టారు. ``నామినేష‌న్ దాఖ‌లు స‌మ‌యంలో ఇచ్చిన అఫిడ‌విట్‌లో ఆస్తుల‌ను స‌రిగా వెల్ల‌డించ‌లేద‌ని, కుమారుడు, భార్య‌కు చెందిన ఆస్తుల‌ను దాచార‌ని.. కాబ‌ట్టి క‌రిఖో ఎన్నిక చెల్ల‌ద‌ని పేర్కొనాలి`` అని కోర్టును ఆశ్ర‌యించారు. ఐదేళ్ల‌పాటు అటు తిరిగి ఇటు తిరిగి చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు ఈ కేసు చేరింది. దీంతో పైవిధంగా తీర్పు చెప్పింది.

సుప్రీం తీర్పులో కీల‌క విష‌యాలు..

+ పోటీలో ఉన్న అభ్య‌ర్థులు విలాస‌వంత‌మైన కార్ల‌లో తిరిగినా.. ఒంటి నిండా బంగారం ధ‌రించినా.. ఆస్తులు కోర‌వ‌చ్చు.

+ ఆస్తులు ఉన్నంత మాత్రాన అవినీతి ప‌రులు కాదు.

+ ఓట‌ర్ల‌కు అన్ని విష‌యాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వారికి అడిగే హ‌క్కు కూడా లేదు.