Begin typing your search above and press return to search.

వైఎస్ భారతికి సుప్రీంలో గుడ్ న్యూస్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి

By:  Tupaki Desk   |   15 July 2023 5:46 AM GMT
వైఎస్ భారతికి సుప్రీంలో గుడ్ న్యూస్!
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని తెలుస్తుంది. ఈ సందర్భంగా... ఈడీ న్యాయవాదిని ఉద్దేశించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు!

ఈడీ జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయంగా వాటికి సమాన విలువైన నగదు డిపాజిట్లు సమర్పించేందుకు సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డికి అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అయితే తాజాగా పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని తెలుస్తుంది.

అవును... ఈడీ జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయంగా వాటికి సమాన విలువైన నగదు డిపాజిట్లు సమర్పించొచ్చంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ వేసిన ఈ పిటీషన్ ను సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారించిందని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఈ కేసులో మీరేం సవాలు చేశారో అర్దం కావటం లేదని ధర్మాసనం ఈడీ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించిందని తెలుస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈడీ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు... జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయ ఆస్తులను జప్తు పరిధిలోకి తీసుకురావటాన్ని సవాలు చేస్తున్నామని కోర్టుకు తెలిపారని సమాచారం.

ఇదే సమయంలో... అక్రమార్జన ద్వారా సంపాదించిన డబ్బుతో రూ. 50 లక్షలు వెచ్చించి స్థలం కొనుగోలు చేస్తే... అనంతరం ఆ స్థలం విలువ రూ. 5 కోట్లకు చేరితే... రూ. 50 లక్షల మేర నగదు డిపాజిట్లు సరిపోదనే అభిప్రాయం ధర్మాసనం ముందు వెలిబుచ్చారని అంటున్నారు.

అయితే ఈ ప్రతిస్పందనపై స్పందించిన ధర్మాసనం... ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో షేర్ల ముఖ విలువ ఎలా నిర్ధారిస్తారు.? షేర్ ధర ఎంతో ఎవరికీ తెలియదుగా.? అని ప్రశ్నించిందని తెలుస్తుంది.

ఇక వైఎస్ భారతి తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారని తెలుస్తుంది. తమది ప్రవేటు కంపెనీ అని.. ప్రస్తుతం జప్తు చేసిన షేర్లు అక్రమార్జన ద్వారా సంపాదించనవి కావని.. జప్తు చేసిన రోజు ఒక్కో షేర్ ముఖ విలువ రూ. 10గా ఉందని ధర్మాసనం ప్రశ్నకు సమాధానంగా తెలిపారని తెలుస్తుంది.

దీంతో... జప్తు చేసిన ఆస్తులు అక్రమార్జనవి కావనే తెలంగాణ హైకోర్టు అభిప్రాయంతో ఈడీ విభేదించనందున పిటీషన్ లో జోక్యం చేసుకోవటానికి నిరాకరిస్తున్నామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొందని తెలుస్తుంది. దీంతో ఈడీ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని తెలుస్తుంది.