''పార్లమెంటును మూసేద్దాం''.. ముసురుతున్న యుద్ధం!
సుప్రీంకోర్టు-పార్లమెంటు విషయాలపై రాజకీయ యుద్ధం ముసురుతోంది. ఇటీవల రాష్ట్రపతి, గవర్నర్‌ల అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 21 April 2025 10:01 PM ISTసుప్రీంకోర్టు-పార్లమెంటు విషయాలపై రాజకీయ యుద్ధం ముసురుతోంది. ఇటీవల రాష్ట్రపతి, గవర్నర్‌ల అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని రకాల బిల్లులను గవర్నర్‌లు నెల లేదా మూడు నెలల వ్యవధిలోనే అనుమతించాల ని.. లేకపోతే.. రాష్ట్రపతిని నివేదించాలని స్పష్టం చేసింది. రాష్ట్రపతి కూడా.. సదరు బిల్లులను మూడు మాసాల కన్నా ఎక్కువసమయం అట్టిపెట్టే అవకాశం లేదని తెలిపింది.
ఈ వ్యవహారం.. వివాదానికి దారితీస్తుందని.. అప్పట్లోనే మేదావులు, రాజ్యాంగ నిపుణులు అంచనా వేశారు. అనుకున్నట్టుగానే.. రాను రాను వివాదం ముదురుతోంది. ఉపరాష్ట్రపతి జగదీఫ్ ధన్‌ఖడ్‌తో మొదలైన ఈ వివాదానికి ఆరంభం.. ఇప్పుడు మళ్లీ.. బీజేపీ, కాంగ్రెస్‌ల వరుకు చేరింది. సుప్రీకోర్టులు.. సమాంతర పార్ల మెంటును నడిపిస్తున్నాయంటూ.. ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అదేవిధంగా ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటులపై.. తీర్పుల క్షిపణులు ప్రయోగిస్తున్నారని అన్నారు.
ఇక. ఈ వ్యవహారానికి బీజేపీ ఎంపీ శశికాంత్ దూబే మరింత ఆజ్యం పోశారు. సుప్రీంకోర్టే శాసనాలు చేసే లెక్క అయితే.. ఇక, పార్లమెంటును మూసేయొచ్చని.. అలానే చేద్దామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తాము కొందరికి `టార్గెట్` అవుతున్నామని.. వ్యాఖ్యానించింది. రాజ్యాంగ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకున్నది కొత్తకాదని.. అయినా.. తమను టార్గెట్ చేస్తున్నారని.. పరోక్షంగా వ్యాఖ్యలు సంధించింది. దీనిపై కాంగ్రెస్ జోక్యం చేసుకుని.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగింది.
ఇప్పుడే కొత్తా?
కాదు.. గతంలో అలహాబాద్ హైకోర్టు.. ఇందిరాగాంధీ గెలుపును తప్పుపట్టినప్పుడు, మినర్వామిల్స్ కేసు(ఆర్టికల్ 19, 21కు సంబంధించి)లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు కూడా.. రాజ్యాంగ వివాదం తెరమీదికి వచ్చింది. ఇందిరాగాంధీ ఏకంగా ఎమర్జెన్సీ విధించేశారు. మినర్వామిల్స్ కేసును కేంద్రం పరిపరివిధాల సమీక్షించాలని కోరుతూ.. పిటిషన్లు వేసింది. ఈ సమయంలోనే.. సుప్రీంకోర్టు.. ``ఇక కోర్టులు ఎందుకు మూసేయండి`` అని పరుషంగా వ్యాఖ్యానించింది. కాగా.. ఇప్పుడు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
