పాకిస్థానీకి ఇండియన్ పాస్ పోర్ట్.. సుప్రీం కీలక ఆదేశాలు!
పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో... భారత్ ప్రభుత్వం దౌత్యపరంగా కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2025 4:30 PM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో... భారత్ ప్రభుత్వం దౌత్యపరంగా కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... దేశంలో నివసించే పాకిస్థాన్ పౌరులను బహిష్కరించింది. ఏప్రిల్ 30 డెడ్ లైన్ పెట్టి.. అనంతరం అట్టరీ వాఘా సరిహద్దును మూసివేయాలని ఆదేశించింది. అనంతరం నిబంధనలు కాస్త సవరించింది.
ఇందులో భాగంగా... తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. దీంతో.. ఇది ఏప్రిల్ 30తో గడువు ముగిసిన అనంతరం సరిహద్దుల్లో చిక్కుకుపోయిన చాలా మందికి ఇది గుడ్ న్యూస్ అయ్యింది. ఈ సమయంలో తన వద్ద ఆధార్ కార్డ్ ఉందని, అయినా తనను దేశం విడిచి వెళ్లమంటున్నారంటూ ఓ పాకిస్థానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం దౌత్యపరమైన ఆంక్షల్లో భాగంగా పాకిస్థాన్ జాతీయులను వీసాలు రద్దు చేసి, బహిష్కరిస్తున్న ప్రభుత్వ ఆదేశం మేరకు బెంగళూరు నుంచి యాక్సెంచర్ ఉద్యోగి, అతని కుటుంబాన్ని దేశం విడిచి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అయితే... అతడిని, అతని కుటుంబాన్ని బహిష్కరించడాన్ని తాజాగా సుప్రీంకోర్టు నిలిపివేసింది.
అహ్మద్ తరిక్ బట్ అనే వ్యక్తి తన ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. ఈ సమయంలో వారందరినీ సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి.. తమ వద్ద భారతీయ పాస్ పోర్టులు, ఆధార్ కార్డులి ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారని తెలిపారు. తాను కేరళలోని కోజికోడ్ లోని ఐఐఎం నుంచి ఎంబీఏ పట్టా పొందినట్లు బట్ తెలిపారు.
అయితే... ఈ ఉత్తర్వులను సొలిసటర్ జనరల్ తుషార్ మెహతా ప్రాతినిద్యం వహించిన ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే.. సుప్రీంకోర్టు మాత్రం ఇందులో కొంత మానవ అంశాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన సుప్రీం.. ఇతర కేసుల్లో కేసుల్లో దుష్టాంతంగా తన ఆదేశాలను ఈ కేసులో ఉపయోగించలేమని స్పష్టం చేసింది.
శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్.. భారతదేశానికి ఎలా వచ్చారో చెప్పాలని మిస్టర్ బట్ ను అడిగారు. ఈ సందర్భంగా స్పందించిన బట్... తాను పాక్ లోని మీర్పూర్ లో జన్మించినట్లు తెలిపారు. అనంతరం 1997లో తన తండ్రితో కలిసి భారత్ వచ్చామని.. అప్పటికి తనకు పాకిస్థాన్ పాస్ పోర్ట్ ఉందని చెప్పారు.
అయితే... శ్రీనగర్ చేరుకున్న తర్వాత తన పాకిస్థాన్ పాస్ పోర్టును జమ్మూకశ్మీర్ హైకోర్టుకు అప్పగించామని.. ఆ తర్వాత తాను ఇండియన్ పాస్ పోర్ట్ కోసం దరఖసతు చేసుకుని దాన్ని పొందినట్లు బట్ తెలిపారు. ఈ క్రమంలో తన కుటుంబంలోని ఇతర సభ్యులు 2000లో శ్రీనగర్ చేరుకున్నారని.. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ భారత పౌరసత్వం, పాస్ పోర్ట్ కలిగి ఉన్నారని కోర్టుకు తెలిపారు.
తన సిస్టర్స్, తాను సిటీలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుకున్నామని తెలిపారు. ఇలా తమవద్ద అన్ని డాక్యుమెంటేషన్ ఉన్నప్పటికీ.. గత వారం హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు తమను దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారని బట్ కోర్టుకు తెలిపారు. దీంతో... భట్, అతని కుటుంబ బహిష్కారాన్ని సుప్రీంకోర్టు నిలిపేసింది.
