'వర్మ' తీరు.. న్యాయ వ్యవస్థపై క్షిపణి ప్రయోగం లాంటిది!
జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా.. పదోన్నతి పొందారు. ఈ క్ర మంలో మార్చిలో ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది.
By: Tupaki Desk | 7 Aug 2025 9:00 PM ISTఅలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తీరుపై సుప్రీంకోర్టు.. తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. ```వర్మ` తీరు.. న్యాయ వ్యవస్థపై క్షిపణి ప్రయోగం లాంటిది`` అని పేర్కొంది. ఆయన వేసిన పిటిషన్‌ను కూడా కొట్టి వేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తుల వ్యవహార శైలి.. సుప్రీంకోర్టును, భారత పవిత్ర న్యాయవ్యవస్థను కూడా ప్రశ్నించేలా ఉందని.. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆయనను పదవి నుంచి తప్పించడం తప్ప.. మరో మార్గం లేదని పేర్కొంది.
ఎవరు? ఏంటి?
జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా.. పదోన్నతి పొందారు. ఈ క్ర మంలో మార్చిలో ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిని నిలువరించేందుకు ఢిల్లీ అగ్ని మాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నీళ్లు కొట్టారు. కానీ, ఆ ఇంట్లోని స్టోర్ రూమ్‌లో.. నిల్వ చేసి.. 500 రూపాయల నోట్ల కట్టలు(వందల కోట్లు ఉంటాయని అంచనా) బయట పడ్డాయి. వీటిలో సగం కాలి పోగా.. మిగిలిన వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే దేశంలో న్యాయవ్యవస్థపై విమర్శ ల పెల్లుబుకుతున్నాయి
ఖచ్చితంగా ఆసమయంలో వర్మ ఇంట్లో దొరికిన నగదు మరింత కలకలం రేపడంతో సుప్రీంకోర్టు సీరి యస్‌గా తీసుకుని.. ఆయనను ఎలాంటి పనీ అప్పగించకుండా.. అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతేకాదు.. సదరు నోట్ల కట్టలపై విచారణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేసింది. ఈ కమిటీ పలుమార్లు విచారణ చేసి నివేదిక ఇచ్చింది. దీనిని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా కేంద్రానికి పంపించారు. వర్మను పదవి నుంచి తప్పించాలని సిఫారసు చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ తీర్మానాలు పెండింగులో ఉన్నాయి. అయితే.. ఇంతలోనే సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో తప్పులు ఎత్తి చూపుతూ.. సుప్రీంకోర్టును తప్పుబడుతు.. జస్టిస్ వర్మ.. అదే కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రెండు సార్లు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఆయనను తీవ్రంగా తప్పుబట్టింది.
తాజాగా జరిగిన విచారణలో ```వర్మ` తీరు.. న్యాయ వ్యవస్థపై క్షిపణి ప్రయోగం లాంటిది`` అని వ్యాఖ్యానిస్తూ.. ఆయన పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో పార్లమెంటు ద్వారా ఆయనను అభిశంసించేందుకు మార్గం సుగమం అయింది. చిత్రం ఏంటంటే.. ఈయన అభిశంసన తీర్మానం వివాదం అయి.. దేశ ఉపరాష్ట్రపతిగా ఉన్న ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
