ప్రధాన న్యాయమూర్తి కంటే న్యాయమూర్తులే కుబేరులు!
తాజాగా అన్ని హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెబ్‌సైట్ లో పొందుపరిచారు.
By: Tupaki Desk | 6 May 2025 4:12 PM ISTకొన్నాళ్ల కిందట ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో సంచుల కొద్దీ రూ.500 నోట్ల కట్టలు దహనమైన కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో న్యాయమూర్తుల ఆదాయం , ఆస్తుల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలతో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుం ది. ఇక, నుంచి ఏటా న్యాయమూర్తులు తమ ఆస్తులను, అప్పులను, ఆదాయాలను వివరించాలని పేర్కొంది. చెప్పినట్టుగానే.. తాజాగా అన్ని హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెబ్‌సైట్ లో పొందుపరిచారు.
దీని ప్రకారం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కంటే కూడా.. ఇతర న్యాయమూ ర్తుల ఆదాయం రెండు నుంచి మూడింతలుగా ఉండడం గమనార్హం. జస్టిస్ సంజీవ్ ఖన్నా.. దగ్గర పావుకిలో బంగారం, రెండు కిలోల వెండి ఉన్నాయి. అలాగే.. 56 లక్షల రూపాయల ఎఫ్‌డీ ఉంది. పీపీఎఫ్‌లో కోటి రూపాయలు, పీఎఫ్‌లో కోటి 20 లక్షలు ఉన్నాయని తేలింది. ఇక, ఆస్తుల విషయానికి వస్తే.. ఢిల్లీలో ఇల్లు, మరో అపార్ట్‌మెంటులో నాలుగు బెడ్ రూంల ఫ్లాటు ఉన్నాయి.
కానీ, న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విశ్వనాథన్.. సీజేఐ కంటే కూడా ఎక్కువ ధన వంతుడిగా ఆయన చెప్పి న వివరాలను బట్టి తెలుస్తోంది. ఈయనకు ఏకంగా 120 కోట్లకు పైగా వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయి. యూపీ, ఢిల్లీలలో ఇళ్లు, తమిళనాడులో ఓ ఫ్లాట్, బంగారం, వెండి ఉన్నాయి. ఈయన గత 15 సంవత్సరా ల్లో 90 కోట్ల మేరకు ఆదాయ పన్ను చెల్లించారట. ఇవన్నీ.. వెబ్ సైట్‌లోనే ఉన్నాయి.
ఇక, త్వరలోనే(ఈనెల 14) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న బీఆర్ గవై ఆస్తుల విషయానికి వస్తే.. బ్యాంకులో 20 లక్షలు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఇళ్లు, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు ఉన్నాయట. ఇక, నగల విలువ 30లక్షలు కాగా.. చేతిలో 61 లక్షల రూపాయలు(డిపాజిట్ రూపంలో) ఉన్నాయని పేర్కొన్నారు.
