సుప్రీం కోర్టులో ఆందోళన కలిగించే ఘటన.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ దేశం
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శనివారం ఆందోళన కలిగించే ఘటన జరిగింది. ఇది మొత్తం దేశ న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులను కలవరానికి గురి చేసింది.
By: Tupaki Desk | 6 Oct 2025 3:25 PM ISTదేశ సర్వోన్నత న్యాయస్థానంలో శనివారం ఆందోళన కలిగించే ఘటన జరిగింది. ఇది మొత్తం దేశ న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులను కలవరానికి గురి చేసింది. సుప్రీంకోర్టు బెంచ్ వద్దకు ఒక వ్యక్తి దూసుకెళ్లి జీజేఐ బీఆర్ గవాయ్ పై దాడికి యత్నించాడు. సీజేఐ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వ్యక్తి బెంచ్ వద్దకు దూసుకెళ్లడం, నినాదాలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో భద్రతా అంశాలపై చర్చ మొదలు పెట్టింది.
బెంచ్ వద్దకు దూసుకెళ్లిన దండగుడు..
సదరు వ్యక్తిని భద్రతా సిబ్బంది పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటన సుప్రీంకోర్టు భద్రతా లోపాలను కళ్లకు కట్టినట్లు చూపుతోంది. న్యాయస్థానంలో జరిగే ఈ తరహా ఘటనలు, చట్టసరమైన చర్యలు, భద్రతా ప్రమాణాలు అవసరమో స్పష్టంగా చూపుతున్నాయి. ఇలాంటి ఘటనలు భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల స్వతంత్రతను, జడ్జీల భద్రతను రక్షించడం అత్యంత ప్రధాన్యతనిచ్చే విషయం.
పౌరులు కూడా బాధ్యతగా మెలగాలి..
అంతేకాక, సామాజిక చైతన్యాన్ని పెంపొందించి, కోర్టులను ధూషించే.. భయపెట్టే ప్రయత్నాలను నిరోధించడం ప్రతి పౌరుడి బాధ్యత. సమాజంలో చట్టానికి, న్యాయస్థానాల గౌరవం ఇవ్వాలి. ఈ ఘటన భవిష్యత్తులో సుప్రీంకోర్టు భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, కోర్టులోని ప్రతి వ్యక్తి సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. సుప్రీంకోర్టులో ఈ దాడి యత్నం, చట్ట పరిమితులను పరీక్షిస్తూ, భద్రతా వ్యవస్థలో ఎప్పటికీ ఇలాంటి లోపాలు గాపరరద్దు కావలసిన అవసరాన్ని మళ్ళీ గుర్తు చేసింది.
సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి..?
దేశ సర్వోన్నత స్థానంలో కూర్చున్న వ్యక్తిపై దాడికి యత్నంచడం అనేది సాధారణ విషయం కాదు.. అంత పెద్ద వ్యక్తిపై దాడికి యత్నించడం.. సాధారణ పౌరుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. వాదనలు అనుకూలంగా.. ప్రతి కూలంగా.. జరగవచ్చు. తీర్పులు కూడా అనుకూలంగా.. ప్రతి కూలంగా.. ఉండవచ్చు కానీ ఇలాంటి దాడులు అనేది దేశం మొత్తం ఆగ్రహిస్తుంది.
