Begin typing your search above and press return to search.

అంతకు మించి... “వివేకం” సినిమాపై సునీత వ్యాఖ్యలు వైరల్!

అవును... వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనమైన విషయంగా మారిందనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 April 2024 10:08 AM GMT
అంతకు మించి... “వివేకం” సినిమాపై  సునీత వ్యాఖ్యలు వైరల్!
X

జగన్ ఇటీవల ప్రారంభించిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర సందర్భంగా వైఎస్ వివేకా మర్డర్ కేసుపై చేసిన వ్యాఖ్యల అనంతరం సునీత తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. నాటి నుంచి మరి ఎక్కువగా సునీత నర్రెడ్డి.. ఏపీ సీఎం జగన్ ని వెంటాడుతున్నట్లు చెబుతున్నారు. నేరుగా వైసీపీ ఓటు వేయొద్దనే క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేసినంత పనిచేశారని అంటున్నారు!! ఈ సమయంలో తాజాగా "వివేకం" సినిమా స్పందించారు!

అవును... వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనమైన విషయంగా మారిందనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఈయన హత్య జరిగినప్పటినుంచి నేటి వరకూ ఈ కేసు వార్తల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది! పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో... ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది. ఇదే సమయంలో వివేకా కుమార్తె సునీత చేస్తున్న కామెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో వివేకా జీవిత చరిత్రతో తెరకెక్కినట్లు చెబుతున్న "వివేకం" సినిమాపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "వివేకం" అనేది డాక్యుమెంటరీ అనాలో, సినిమా అనాలో తెలియడం లేదు" అని మొదలుపెట్టిన సునీత... ఎవరో కానీ.. చాలా ధైర్యంగా ఆ సినిమా తీశారని తెలిపారు. ఆ సినిమాలో కొన్ని వ్యక్తిగత అంశాలో తేడా ఉంటే ఉండొచ్చు కానీ... చివరి అరగంట మాత్రం తనకు చాలా భయమేసిందని.. ఆ సమయంలో తాను కళ్లు మూసుకున్నానని సునీత చెప్పారు! ఇదే సమయంలో... వివేకా మర్డర్ విషయంలో రియాలిటీని తలచుకొంటే మాత్రం "వివేకం" సినిమాను లైట్ గా తీశారని చెప్పారు.

ఇదే సమయంలో... గత ఎన్నికల్లో తన తండ్రి హత్యను రాజకీయాలకు వాడుకున్నారని చెప్పిన సునీత.. ఐదేళ్ల తర్వాత తిరిగి ఇప్పుడూ అదే చేస్తున్నారని అన్నారు. ఇక తానెప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు కానీ.. తప్పు జరుగుతోంది కాబట్టి బయటకు వచ్చి ఐదేళ్లుగా పోరాడుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా తనతో పాటు రాష్ట్రానికీ మంచిది కాదని చెప్పడం గమనార్హం! వైకాపా ప్రభుత్వం మళ్లీ వస్తే వ్యక్తిగతంగా నాతో పాటు ఈ రాష్ట్రానికీ మంచిది కాదు’’ అని సునీత వ్యాఖ్యానించారు.

కాగా... ఈ సినిమాపై వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన స్టేట్ మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉందంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ప్రదర్శనతో పాటు, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ లను ప్రతివాదులుగా చేర్చారు.