Begin typing your search above and press return to search.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్... బీర్ల తయారీకి కొత్త కష్టాలు!

ఈ సమయంలో ఏర్పడిన నీటి కొరత బీర్ల తయారీ బ్రూవరీలపై తీవ్రంగా పడుతుందని అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందనేది ఇప్పుడూ చూద్దాం!

By:  Tupaki Desk   |   31 March 2024 5:45 AM GMT
మందుబాబులకు బ్యాడ్  న్యూస్... బీర్ల తయారీకి కొత్త కష్టాలు!
X

వేసవి వచ్చిందంటే నీటి కొరత ఏ స్థాయిలో ఉంటుందనేది తెలిసిన విషయమే. ఈ విషయంలో తండాలు, మెట్రోపాలిటన్ నగరాలు అనే తారతమ్యాలు ఏమీ ఉండటం లేదు. అక్కడ చూసినా నీటి కష్టాలే దర్శనమిస్తున్నాయి. ఇంకా సరైన వేసవి ప్రారంభం కాకుండానే అప్పుడే గొంతులు తడారిపోతున్నాయి.. గుక్కెడు మంచినీటి కోసం అపసోపాలు పడుతున్నాయి. ఈ సమయంలో... ఈ ఎఫెక్ట్ బీర్ల తయారీ మీద కూడా పడుతోందంట.

అవును... ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్లు.. బిందెడు నీళ్లు దొరకడం సామాన్యుడికి ఇబ్బంది అవుతుంటే... లక్షల లీటర్ల నీళ్లు అవసరమైన బీర్ల తయారీకి ఈ ఎఫెక్ట్ మరింతగా ఉందంట. సాధారణంగా వేసవి వచ్చిందంటే... మందుబాబుల మనసంతా బీర్ల పైకి వెళ్తాదనడానికి గతేడాది తెలంగాణలో ఒక్క వేసవిలోనే అమ్ముడైన బీర్ల లెక్కలే పెద్ద ఉదాహరణ! ఈ భానుడి భగభగలకు బీరే సరైన ఉపశమనం అని భావించేవారు కాస్త ఎక్కువగానే ఉంటారని తెలుస్తుంది!

ఈ సమయంలో ఏర్పడిన నీటి కొరత బీర్ల తయారీ బ్రూవరీలపై తీవ్రంగా పడుతుందని అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందనేది ఇప్పుడూ చూద్దాం!

ఈ ఏడాది మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 48,71,668 కేసుల బీర్ విక్రయాలతో రూ.1458 కోట్ల రాబడిని అబ్కారీ శాఖ నమోదు చేసుకుందని అంటున్నారు. మార్చిలోనే మందుబాబులు ఈ స్థాయిలో విజృంభిస్తే... ఇక ఏప్రిల్, మే నెలల్లో ఆ లెక్కేవేరన్నట్లుగా పరిస్థితి మారిపోబోతోందని అంటున్నారు. అయితే... ఆ స్థాయిలో ఉత్పత్తిపై రానున్న రెండు మూడు నెలల్లో నీటి కష్టాలు పెను ప్రభావం చూపబోతున్నాయని అంటున్నారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా అనుమతించిన మైక్రో బూర్వరీల్లో బీర్ల తయారీ అక్కడికక్కడే జరుగుతోంది. దీంతో సిటీల్లో పెద్దగా ఈ ప్రభావం కనిపించనప్పటికీ... గ్రామీణ ప్రాంతాల్లోనూ, శివారు ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు. దీనికంతకటికీ కారణం కరువు ప్రభవమేననేది చెబ్బుతున్నారు.

ఇంతకాలం నగరంలోని సింగూరు జలాశయం నుంచి నామమాత్రపు ధరకే రోజుకు 44 లక్షల లీటర్ల నీటిని బీర్ ఉత్పత్తి చేసే బ్రూవరీలకు రాష్ట్ర ప్రభావమే సరఫరా చేసేది! అయితే... ప్రజల దాహార్తిని తీర్చాల్సిఒన మజీరా, సింగూరు ప్రాజెక్టల నుంచి ఇన్నేళ్లుగా నీటి కేటాయింపులు ఎలా చేస్తున్నారనే విషయం పలు అనుమానాలు తలెత్తుతున్నాయని తెలుస్తుంది. 4 బ్రూవరీలకు రొజుకి కనీసం 44 లక్షల నీరు అవసరం అని తెలుస్తుంది.

పైగా వీటికి బోరు నీరు, ఇతరాత్రా నీటిలో బీరు తయారీ సాధ్యం కాదని.. తాగునీటి ప్రాజెక్టు జలాశయాలే శరణ్యమని అంటున్నారు. దీంతో... పటాంచెరువు పరిధిలోని ఎస్.ఏ.బి. మిల్లర్ ఇండియా, యునైటెడ్ బ్రూవరీసి, కర్స్ల్ బెర్గ్ ఇండియా, క్రౌన్ బీర్స్ బ్రువరీలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఉత్పన్నమైందని అంటున్నారు. మరి ఈ ఎఫెక్ట్ రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఉండబోతుందనేది చూడాలి!