Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ కు సీనియర్ హీరో సుమన్ ఆబ్లిగేషన్.. డిప్యూటీ సీఎం స్పందన ఎలా ఉంటుందో?

సీనియర్ నటుడు సుమన్ కు మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉంది. గత కొంత కాలంగా ఆయన మార్షల్ ఆర్ట్స్ ను పాఠ్యాంశంగా చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   15 Sept 2025 1:31 PM IST
పవర్ స్టార్ కు సీనియర్ హీరో సుమన్ ఆబ్లిగేషన్.. డిప్యూటీ సీఎం స్పందన ఎలా ఉంటుందో?
X

ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సీనియర్ నటుడు, ప్రముఖ హీరో సుమన్ ఓ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి మార్షన్ ఆట్ట్స్ లో శిక్షణ ఇవ్వాలని కోరారు. మార్సల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉన్న పవన్ ఆత్మరక్షణకు, ఆత్మస్థైర్యానికి ఇది ఎంతగానో సహాయపడే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణను తప్పనిసరి చేసేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించిన సుమన్ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ విద్యార్థులకు ఉపయోగపడే అంశం కనుక పవన్ ను ఈ విషయమై అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు.

సీనియర్ నటుడు సుమన్ కు మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉంది. గత కొంత కాలంగా ఆయన మార్షల్ ఆర్ట్స్ ను పాఠ్యాంశంగా చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే ఈ విషయమై ఇంతవరకు ఏ ప్రభుత్వం స్పందించలేదు. అయినప్పటికీ సుమన్ తన ప్రయత్నాలను విరమించుకోలేదు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంచడంతోపాటు వారి ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యను నేర్పించడం తప్పుకాదని సుమన్ అభిప్రాయపడుతున్నారు. తన ఆలోచనను ప్రభుత్వం ద్రుష్టిలో పెట్టేందుకు ఆయన పవన్ ను ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా చెబుతున్నారు.

పవన్ కన్నా సినిమాల్లో సీనియర్ అయిన సుమన్ తన సినిమాల్లో కరాటే విన్యాసాలతో ఆకట్టుకునేవారు. అదేవిధంగా పవన్ కూడా తన సినిమాల్లో మార్షల్ ఆట్ట్స్ లో తన విన్యాసాలను ప్రదర్శించేవారు. ఇక త్వరలో విడుదలయ్యే ఓజీ సినిమాలో కూడా పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాధాన్యం ఉన్న సీన్లు చేశారని అంటున్నారు. పవన్ మంచి స్టార్ గా నిలదొక్కుకోడానికి డూప్ లు లేకుండా ఆయన తమ్ముడు సినిమాలో చేసిన సీన్లు ప్రధాన కారణంగా చెబుతారు. పవన్ ను పెద్ద స్టార్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ను ప్రవేశపెట్టి.. రుణం తీర్చుకోవాలని సుమన్ కోరుతున్నారు.

ఇక ఒకప్పుడు సినిమాల్లో కరాటే ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమన్.. ఆదివారం పాడేరులో జరిగిన కరాటే శిక్షణ అకాడమీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన్ విద్యార్థులకు కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఆయన స్వాగతించారు. ఇక సుమన్ చివరిసారిగా నితిన్ హీరో నిర్మించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో నటించారు. 2023లో ఈ చిత్రం విడుదలైంది.