Begin typing your search above and press return to search.

మోడీతో సుమలత భేటీ...జేడీఎస్ కి షాక్ ఇస్తారా..?

ఆమె మాండ్యా సీటు విషయంలో హామీ తీసుకునేందుకే ప్రధాని తో భేటీ అయ్యారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 3:49 AM GMT
మోడీతో సుమలత భేటీ...జేడీఎస్ కి షాక్ ఇస్తారా..?
X

కర్నాటకలోని మాండ్యా ఎంపీ నిన్నటి తరం సినీ నటి అయిన సుమలతా అంబరీష్ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సడెన్ గా ఆమె ప్రధానితో భేటీ కావడం అంటే విశేషం ఏదో ఉంది అని అంటున్నారు. ఆమె మాండ్యా సీటు విషయంలో హామీ తీసుకునేందుకే ప్రధాని తో భేటీ అయ్యారని అంటున్నారు.

బీజేపీ జేడీఎస్ ల మధ్య వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి పొత్తు ఉంటుందని అంటున్నారు. మొత్తం 28 ఎంపీ సీట్లలో బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తూ జేడీఎస్ కి నాలుగు సీట్లు ఇస్తుందని అంటున్నారు. అందులో మాండ్యా లోక్ సభ సీటు ఒకటి అని అంటున్నారు. ఈ సీటులో సినీ నటి సుమలత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.

ఈ సీటు నుంచి ఆమె 2019 ఎన్నికల్లో ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆమెకు బీజేపీ తెర వెనక మద్దతు ఇచ్చింది. అలా మాజీ ప్రధాని దేవేగౌడ సొంత సీటు అయిన మాండ్యాలో ఆయన మనవడు నిఖిల్ కుమారస్వామిని సుమలత ఓడించారు. ఇక అనంతరం జరిగిన పరిణామాల నేపధ్యంలో సుమలత బీజేపీకి సన్నిహితం అయ్యారు.

అలా 2024 ఎన్నికల్లో మరోసారి మాండ్యా నుంచి పోటీకి ఆమె తయారు గా ఉన్నారు. ఇంతలో కర్నాటకలో బీజేపీ జేడీఎస్ ల మధ్య పొత్తు ఉంటుందని వార్తలు రావడంతో బీజేపీ నేతలు కలవరపడుతున్నారు. పాత మైసూరు ప్రాంతంలో సీట్లు అన్నీ కూడా జేడీఎస్ కి ఇస్తారని వార్తలు రావడంతో తమ సంగతేంటి అని వారు వర్రీ అవుతున్నారు. మాండ్యా ఎంపీగా ఉన్న సుమలత అయితే తన సీటు విషయంలో బీజేపీ అధినాయకత్వంతో మాట్లడాలనే మోడీని కలిసారు అంటున్నారు.

మరి మోడీ ఆమెకు ఏ రకమైన హామీ ఇచ్చారో తెలియదు కానీ అనంతరం ఆమె ట్విట్టర్ ఎక్స్ ద్వారా మోడీ గారికి ధాంక్స్ అని పెట్టడంతో జేడీఎస్ కి మాండ్యా సీటు దక్కదా అన్న చర్చ అయితే మొదలైంది. జేడీఎస్ కి ఎన్ని సీట్లు పొత్తులో ఇచ్చినా కూడా మాండ్యా చాలా కీలకమైన సీటు. అక్కడ మరోసారి దేవేగౌడ మనవడు పోటీకి దిగుతున్న సీటు ఇదే.

అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటుని వదులుకోవడానికి జేడీఎస్ ఒప్పుకోదు అనే అంటున్నారు. ఏకంగా ప్రధానినే కలసి వచ్చిన సుమలత ఈ సీటు విషయంలో తన పట్టుని కూడా నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఇపుడు అతి పెద్ద పేచీనే ఏర్పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకా పొత్తు పొడవకుండానే మాండ్యా లోక్ సభ సీటు వద్ద పీట ముడి పడుతుందా అన్న చర్చ కూడా వస్తోంది. అయితే సుమలతకు ప్రధాని ఏ హామీ ఇచ్చి ఉంటారు అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా సుమలత మాండ్యా సీటు ఒక్కటి ఇపుడు పొత్తుల మధ్యన మిత్ర భేదానికి దారితీసేలా ఉందా అన్నది కూడా ఆలోచిస్తున్నారుట.