Begin typing your search above and press return to search.

కిలేడీ: మాస్కు పెట్టుకొని లిఫ్టు అడిగే ఆమెకు సాయం చేస్తే అంతే!

ఇప్పటికి ఎంతోమందిని మోసం చేసిన ఈ కిలేడీని తాజాగా బంజారాహిల్స్ పరిధిలోని ఒక కారు డ్రైవర్ ను మోసం చేసే క్రమంలో పోలీసులకు చిక్కింది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:41 AM GMT
కిలేడీ: మాస్కు పెట్టుకొని లిఫ్టు అడిగే ఆమెకు సాయం చేస్తే అంతే!
X

ముఖానికి మాస్కు.. చూసినంతనే ఆకర్షణీయంగా కనిపించేలా వస్త్రధారణ.. అత్యవసరంగా వెళ్లాలన్నట్లుగా బిల్డప్.. గురి చూసి వదిలిన బాణంలా.. టార్గెట్ చేసి మరీ వాహనాల్ని లిఫ్టు అడిగే ఒక మహిళకు.. పోనీలే అనుకొని లిఫ్టు ఇస్తే అడ్డంగా బుక్ చేయటమే కాదు.. అత్యాచారం జరిగినట్లుగా ఆగమాగం చేస్తోంది. అందినకాడికి దండుకునే ఈ కిలేడీ కొంతకాలంగా జూబ్లీహిల్స్.. పంజాగుట్ట పరిధిలో బోలెడంత మందిని ముంచేసింది.

ఇప్పటికి ఎంతోమందిని మోసం చేసిన ఈ కిలేడీని తాజాగా బంజారాహిల్స్ పరిధిలోని ఒక కారు డ్రైవర్ ను మోసం చేసే క్రమంలో పోలీసులకు చిక్కింది. బంజారాహిల్స్ కు చెందిన కారు డ్రైవర్ పరమానంద మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కేబీఆర్ పార్కు వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ఒక మహిళ లిఫ్టు అడిగింది. పోనీలే అన్న ఉద్దేశంతో ఆమెను కారు ఎక్కించుకున్న కారు డ్రైవర్ కు.. కాసింత దూరం వెళ్లినంతనే డబ్బులు ఇవ్వాలని.. లేదంటే లైంగిక దాడికి పాల్పడినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగింది.

దీంతో కంగారుపడ్డ డ్రైవర్.. ఆమెను తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. జరిగిన ఉదంతాన్ని పోలీసలకు వివరించాడు. విషయం అర్థమైన ఇన్ స్పెక్టర్ వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగా ఆమెను 32 ఏళ్ల సుల్తానాగా గుర్తించారు. తననను తాను న్యాయవాదిగా చెప్పుకునే ఈమె వద్ద లభించిన పలు ఆధారాల్ని చూడగా.. ఆమెపై హైదరాబాద్.. సైబరాబాద్ కమిషనరేట్లలో 15కు పైగా కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేసి.. ఆమెకు నిజంగానే బార్ అసోసియేషన్ లో గుర్తింపు ఉందా? లేదా? అన్న విషయాన్ని తెలుసకునేందుకు లేఖ రాయనున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. లిప్టు కోసం అడిగే వారి విషయంలో తొందరపాటు పనికి రాదన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే.. మరోసారి స్పష్టమవుతుందని చెప్పాి.