సుజనా సర్.. బిజీ బిజీ.. ఏం చేస్తున్నారంటే..!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు.. సుజనా చౌదరి బిజీబిజీగా మారిపోయారు.
By: Tupaki Desk | 17 April 2025 5:00 PM ISTవిజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు.. సుజనా చౌదరి బిజీబిజీగా మారిపోయారు. నియోజకవర్గంలో పనుల మాట అలా ఉంచితే.. కీలక వ్యవహారాల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నార న్నది పార్టీ నాయకులు చెబుతున్న మాట. ప్రస్తుతం కాంట్రాక్టులు దక్కించుకునే క్రమంలో చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కమల నాథులు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు.
ఆయన ఎన్నికైన మొదట్లో.. రాజకీయంగా దూకుడు చూపించారు. నియోజకవర్గంలో జాబ్ మేళాలు, మురుగునీటి కాల్వల శుద్ధి, ప్రజలకు చేరువలో ఉండడం వంటివి చేశారు. కానీ.. తర్వాత తర్వాత.. రూటు మార్చేశారన్నది.. స్థానిక ప్రజలు కూడా చెబుతున్న మాట. ఇప్పుడు ఎమ్మెల్యే కార్యాలయం ఉన్నా.. దాని లో చిన్నస్థాయి నాయకులు మాత్రమే ఉంటున్నారు. పైగా.. సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యార ని చెబుతున్నారు.
అంతేకాదు.. బీజేపీ కంటే ఎక్కువగా టీడీపీ నాయకులతోనే కలివిడిగా ఉంటున్నారన్న చర్చ కూడా ఉంది. అదికూడా.. చోటా మోటా నాయకులను మాజీ ఎమ్మెల్సీలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కేవలం ఉన్నస్థాయిలో ఉన్న మంత్రులు, ఇతర సీనియర్ నాయకులతో మాత్రమే.. టచ్‌లో ఉంటున్నారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. సహజంగానే వ్యాపార వేత్త అయిన సుజనా.. వాటికి ప్రాధాన్యం ఇవ్వడం తప్పుకాదు.
కానీ.. అదే పనిగా పెట్టుకుని గత 8 నెలల నుంచి కూడా.. వ్యవహరిస్తున్నారన్నది ప్రజల టాక్. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత.. తర్వాత.. మాత్రం మార్పు కనిపించిందని అంటున్నారు. ప్రస్తుతం తమ సమ స్యలు పట్టించుకునే.. పరిస్థితి కూడా లేదని వారు వాదన వినిపిస్తుండడం గమనార్హం. దీంతో సుజనా పరిస్థితి.. ఒకరకంగా ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. మరి ఈ పరిస్థితి మారుతుందో లేదో చూడాలి. ఏదేమైనా.. ప్రస్తుతం సుజనాచౌదరి పరిస్థితి ఏం జరుగుతుందో చూడాలి.
