Begin typing your search above and press return to search.

ఖమ్మం నుంచి నందమూరి సుహాసిని పోటీ...!?

ఆ తరువాత 2023లో టీడీపీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో సుహాసిని కూడా రాజకీయంగా అక్కడ కనిపించలేదు.

By:  Tupaki Desk   |   1 April 2024 10:30 AM GMT
ఖమ్మం నుంచి నందమూరి సుహాసిని పోటీ...!?
X

ఎన్టీఆర్ మనవరాలు చంద్రబాబు మేనకోడలు జూనియర్ ఎన్టీఆర్ అక్క అయిన నందమూరి సుహాసిని తెలంగాణా నుంచి మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు అంటున్నారు. ఆమె 2018 లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. టీడీపీ తరఫున కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చూసారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కూటమిగా వచ్చినా అక్కడ బీఆర్ఎస్ గెలిచింది.

ఆ తరువాత 2023లో టీడీపీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో సుహాసిని కూడా రాజకీయంగా అక్కడ కనిపించలేదు. ఈ మధ్యలో ఆమె ఏపీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారు అన్న చర్చ సాగింది. ఆమె వల్లభనేని వంశీని ఓడించడానికి గన్నవరం నుంచి బరిలో ఉంటారు అని ప్రచారం చేశారు. అలాగే ఎన్టీఆర్ సొంత గడ్డ అయిన గుడివాడ నుంచి పోటీ చేసి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు సిద్ధమవుతారని అనుకున్నారు.

అయితే ఇవేమీ జరగలేదు. సడెన్ గా ఆమె తెలంగాణా రాజకీయ తెర మీద మెరిసారు. అంతే కాదు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో ఆమె భేటీ అయ్యారు. ఈ భేటీ వెనక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. టీడీపీలో ఉన్న తన మేనకోడలిని బాబే కాంగ్రెస్ వైపు నడిపించారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీ నాయకుడు కావడంతో ఆయన పార్టీలో సుహాసిని చేరితే రాజకీయంగా ఆమెకు మేలు జరుగుతుందని తెలనగాణాలో నందమూరి ఫ్యామిలీకి కూడా మరో చాన్స్ ఉంటుందని ఎప్పటికైనా అది టీడీపీకి ఉపయోగపడుతుందని ఆలోచించే బాబు సుహాసినిని కాంగ్రెస్ వైపుగా నడిపించారు అని అంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డి ఆమెకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇచ్చేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. ఖమ్మం కాంగ్రెస్ కి కంచుకోట. అక్కడ ఆ పార్టీ అక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని సీట్లూ గెలుచుకుంది. ఇక 2019లో మాత్రం ఖమ్మం ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలుచుకుంది. దాని కంటే ముందు 2014లో వైసీపీ గెలుచుకుంది. ఇలా కాంగ్రెస్ ఓట్లు షిఫ్ట్ అవడం వల్లనే వైసీపీ గెలిచింది అని అంటారు

ఇక కాంగ్రెస్ కి అసెంబ్లీ సీట్లు బాగానే దక్కుతున్నా ఎంపీ సీటు దగ్గరకు వచ్చేసరికి మాత్రం బీఆర్ఎస్ తన్నుకుపోతోంది. 2004 తరువాత ఖమ్మం లోక్ సభలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. దాంతో ఆ పార్టీ అన్నీ ఆలోచించి బలమైన అభ్యర్ధులను బరిలకి దించాలని చూస్తోంది. అయితే ఖమ్మం లోక్ సభ సీటు ఈసారి కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుందని భావించి ఆ పార్టీలో సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ సాగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముగ్గురు కీలక మంత్రులు ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఈ సీటు తమ వారికి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అందులో మొదటి వారు భట్టి విక్రమార్క. ఆయన తన సతీమణి మల్లు నందిని కోసం ఈ సీటు అడుగుతున్నారు అలాగే 2014లో ఈ సీటులో గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి కోసం ఖమ్మం లోక్ సభ సీటు అడుగుతున్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడి తుమ్మల యుగేందర్ కోసం పట్టుబడుతున్నారు.

ఈ సీటు ముగ్గురిలో ఎవరికి ఇచ్చినా మిగిలిన ఇద్దరితోనూ రేవంత్ రెడ్డికి ఇబ్బంది వస్తుంది. ఈ ముగ్గురూ బలమైన నేతలు. పైగా రేవంత్ కి కావాల్సిన వారు. అందుకే ఈ ముగ్గురిలోనూ ఎవరికీ ఖమ్మం టికెట్ ఇవ్వకుండా కొత్త వారిని పోటీకి దించాలని చూస్తున్నారు. అందుకే నందమూరి సుహాసినిని ముందుకు తెచ్చారని అంటున్నారు. నిజానికి ఆమె కంటే ముందే ప్రియాంకా గాంధీని ఖమ్మం బరిలో నిలబడమని రేవంత్ రెడ్డి కోరినా ఆమె నో చెప్పేశారు.

ఈ పరిణామాల నేపధ్యంలో సుహాసినికి టికెట్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఆమెకు కాంగ్రెస్ నుంచి అన్ని వర్గాల మద్దతుతో పాటు ఖమ్మంలో బలంగా ఉన్న టీడీపీ మద్దతు కూడా దక్కుతుందని భారీ మెజారిటీతో ఆమె ఖమ్మం నుంచి ఎంపీ అవుతారని అంటున్నారు. మొత్తం మీద ఇది బాబు స్కెచ్ గా ఉందని అంటున్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ వీక్ అయితే ఆ ప్లేస్ లో తిరిగి రావాలని చూస్తున్న టీడీపీకి రేపటి రోజున బలమైన నేతలు కావాలి.

అందుకే సుహాసినిని కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సుహాసిని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం. అన్నట్లు ఆమె తండ్రి ఎవరో తెలుసుగా. నందమూరి హరిక్రిష్ణ. సో సుహాసినికి ఇపుడు పొలిటికల్ రీ ఎంట్రీ సూపర్ సక్సెస్ గానే సాగుతుందని అంటున్నారు.