Begin typing your search above and press return to search.

మిస్ వరల్డ్ పోటీల్లో మేఘా క్రిష్ణారెడ్డి భార్యకు అరుదైన గౌరవం

రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని మౌలిక సదుపాయాల సంస్థగా.. స్వల్ప వ్యవధిలో పేరు ప్రఖ్యాతుల్ని మాత్రమే కాదు.. కీలకమైన ప్రాజెక్టుల్ని సొంతం చేసుకున్న సంస్థగా మేఘా గుర్తింపు పొందింది.

By:  Tupaki Desk   |   31 May 2025 10:10 AM IST
మిస్ వరల్డ్ పోటీల్లో మేఘా క్రిష్ణారెడ్డి భార్యకు అరుదైన గౌరవం
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని మౌలిక సదుపాయాల సంస్థగా.. స్వల్ప వ్యవధిలో పేరు ప్రఖ్యాతుల్ని మాత్రమే కాదు.. కీలకమైన ప్రాజెక్టుల్ని సొంతం చేసుకున్న సంస్థగా మేఘా గుర్తింపు పొందింది.కాళేశ్వరం ప్రాజెక్టులు మొదలు కొని ఈవీ బస్సుల నిర్మాణం వరకు.. ఆ సంస్థ చేసే వ్యాపారాలు అన్నిఇన్ని కావు. ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల్ని చేపట్టింది మేఘా.

ఈ సంస్థకు అధిపతిగా క్రిష్ణారెడ్డి గురించి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలుస్తారు. చాలా తక్కువ వ్యవధిలోనే ఆయన టాప్ సంపన్నుల్లో ఒకరిగా నిలిచిన వైనం తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. వారితో సత్ సంబంధాలు కొనసాగించే విలక్షణత ఆయన సొంతంగా చెప్పాలి. ఆయన సతీమణి సుధారెడ్డి. ఆమె మేఘా ఇంజనీరింగ్ సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఆమెను ఫ్యాషన్ ప్రీక్ గా అభివర్ణిస్తారు. అలాంటి ఆమెకు అరుదైన గుర్తింపు.. గౌరవం లభించింది. మిస్ వరల్డ్ ఫైనల్ పోటీల్లో ఉండే నలుగురు న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా ఆమెకు చోటు కల్పించారు. అంతేకాదు.. మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె నియమితులయ్యారు. ఈ విషయాన్ని సంస్థ ఛైర్ పర్సన్ జూలియా మోర్లీ అధికారికంగా ప్రకటించారు.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 108 మంది అందాల భామలకు సుధారెడ్డి కొద్ది రోజుల క్రితం తన నివాసంలో బ్యూటీ మిస్ ఏ పర్పస్ గాలా విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం తెలిసిందే. బాలికలకు సమాన అవకాశాలు కల్పించటం.. మహిళా సాధికారత కోసం సుధారెడ్డి ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి.. సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. సామాజిక సేవలో నిమగ్నమైన సుధారెడ్డిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని జూలియో మోర్లీ ప్రకటించారు.