Begin typing your search above and press return to search.

తాడికొండ వైసీపీలో సుచ‌రిత‌కు జైకొట్టేదెవ‌రు..!

వైసీపీ అనుస‌రిస్తున్న వైఖ‌రితో గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 3:30 PM GMT
తాడికొండ వైసీపీలో సుచ‌రిత‌కు జైకొట్టేదెవ‌రు..!
X

వైసీపీ అనుస‌రిస్తున్న వైఖ‌రితో గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ నియోజ‌కవ‌ర్గానికి తాజా ఇంచార్జ్‌గా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌ను వైసీపీ నియ‌మించింది. అంటే.. దాదాపు ఆమెకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఖాయ‌మనే ది స్ప‌ష్టం చేసింది. అయితే.. ఈమె ఇంకా కార్య రంగంలోకి రాలేదు. దీనికి అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నా య‌ని స్థానిక నాయ‌కులు చెబుతున్నారు.

''మేక‌తోటి వ‌చ్చినా.. జెండా ప‌ట్టుకునేవారు.. ఆమెకు జైకొట్టేవారు ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు. ఆమె ఇక్క డ కొత్త నాయ‌కురాలు. పైగా.. ఈ టికెట్‌పై ఇద్ద‌రు నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. వారి సామాజిక‌వ‌ర్గం ఇప్పుడు మేకతోటికి స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మే'' అని తాడికొండ‌కు చెందిన ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు ఒక‌రు చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి ప్ర‌స్తుత ఎమ్మెల్యే, 2019లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని త‌ప్పించిన త‌ర్వాత‌.. తాడికొండ వైసీపీలో మ‌రింత వివాదం చోటు చేసుకుంది.

నిజానికి శ్రీదేవిని ప‌క్క‌న పెట్టాల‌ని ముందుగానే ఒక అంచ‌నాకు వ‌చ్చిన వైసీపీ.. ఈ క్ర‌మంలో మాజీ మం త్రి, టీడీపి నుంచి వ‌చ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌కు ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీం తో ఆయ‌న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇక‌, త‌న దైన శైలిలో నాయ‌కుల ను కూడా ఆక‌ర్షించారు. మండ‌ల స్థాయిలో మాణిక్యానికి అనుభ‌వం ఉన్న నేప‌థ్యంలో చాలా మంది ఆయ న వెంటే తిరిగారు.

ఇంత‌లోనే డిప్యూటీ ఇంచార్జ్‌గా గుంటూరు జిల్లా ప‌రిష‌త్‌ చైర్ ప‌ర్స‌న్ క‌త్తెర హెన్రీ క్రిస్టినా భ‌ర్త‌.. క‌త్తెర సురేష్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో ఆయ‌న కూడా.. త‌న‌కే టికెట్ ఇస్తార‌ని అనుకుని భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించారు. పైగా అటు డొక్కా.. ఇటు సురేష్‌లు మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. దీంతో వీరిలో ఎవ‌రికి ఇచ్చినా.. స‌ర్దు కుపోవాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు.

కానీ, ఇంత‌లోనే ప్ర‌త్తిపాడు కు చెందిన పైగా మాల సామాజిక వ‌ర్గానికి చెందిన సుచ‌రిత‌ను తీసుకువ‌చ్చి.. తాడికొండ ఇంచార్జ్ ప‌ద‌విని అప్ప‌గించ‌డంతో అటు మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌, ఇటు సురేష్‌లు కూడా తీవ్రంగా హ‌ర్ట్ అయ్యారు. ఫ‌లితంగా వారు పార్టీకి దూర‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. పార్టీలోనే ఉన్నా.. కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు.

''ఇన్నాళ్లు అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం.. ఇప్పుడు మా ప‌రిస్థితి ఏంటి?'' అని వారు ప్ర‌శ్నిస్తున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంకో వైపు.. క్షేత్ర‌స్థాయిలో మేక‌తోటికి అనుచ‌రుల బ‌లం లేక‌పోవ‌డం.. అటు డొక్కా, ఇటు సురేష్‌లు స‌హాయ నిరాక‌ర‌ణ ప్ర‌క‌టించ‌డంతో ఆమె ప‌రిస్థితి ఇప్పుడు గంద‌ర‌గోళంలో ప‌డింద‌ని అంటున్నారు.