Begin typing your search above and press return to search.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి ఉద్యోగం.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం!

ఈ క్రమంలో.. ఇప్పటికే అతని భార్యకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కల్పించగా.. తాజాగా అతని సోదరుడు నవీన్ కు కూటమి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.

By:  Tupaki Desk   |   30 May 2025 12:40 PM IST
డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి ఉద్యోగం.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం!
X

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అతని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిస్తోంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అతని భార్యకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కల్పించగా.. తాజాగా అతని సోదరుడు నవీన్ కు కూటమి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఇదే సమయంలో కేసును తిరిగి విచారించి, నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రయత్నిస్తోంది.

అవును.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణం హత్య వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అతని కుటుంబానికి కూటమి సర్కార్ అన్ని విధాలా అండగా నిలిచింది! ఇందులో భాగంగా.. ఇప్పటికే ఆయన భార్యకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించగా.. తాజాగా కూటమి ప్రభుత్వం నవీన్ కు జాబ్ ఇచ్చింది!

ఇందులో భాగంగా... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్వారపూడిలో గల ఎస్సీ సంక్షేమ హాస్టల్ లో ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా.. నవీన్ కు అపాయింట్ మెంట్ ఆర్డర్ అందజేశారు.

కాగా... 2022 మే 20న సుబ్రహ్మణ్యం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారగా.. దళిత, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించిన పరిస్థితి. దీనిపై అప్పట్లో వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి!

ఆ సమయంలో 2023లో సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు వైద్య, ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా వైసీపీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఇదే సమయంలో మృతుడి కుటుంబానికి కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలంలో స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వీరిని మరింత ఆదుకునేలా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది.

ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం తమ్ముడు నవీన్ కు ఉద్యోగం కల్పించింది కూటమి సర్కార్. మరోపక్క సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి తెరవాలని, అతడి కుటుంబాన్ని ఆదుకొవాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సైతం ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.