Begin typing your search above and press return to search.

స్పైడర్ మ్యాన్ కాస్టూమ్స్ లో బైక్ పై రచ్చ... షాకిచ్చిన పోలీసులు!

ఈ సమయంలో.. స్పైడర్ మ్యాన్ కాస్టూమ్స్ ధరించిన ఇద్దరు యువతీ యువకులు బైక్ పై రొమాన్స్ చేస్తూ హల్ చల్ చేశారు!

By:  Tupaki Desk   |   27 April 2024 1:30 AM GMT
స్పైడర్  మ్యాన్  కాస్టూమ్స్  లో బైక్  పై రచ్చ... షాకిచ్చిన పోలీసులు!
X

కొంతమంది యువత రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలనో లేక మరోకార్ణంతోనో తెలియదు కానీ... బ్రైన్ కి ఫిల్టర్ లేకుండా తోచిన పనులు చేసుకుపోతుంటున్నారనే విమర్శలు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ఈ రీల్స్ పేరు చెప్పి వారు చేసే విన్యాశాలు కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని మాత్రం అసహ్యంగా, ఇంకొన్ని వికృతంగా ఉంటుంటాయి. ఈ సమయంలో.. స్పైడర్ మ్యాన్ కాస్టూమ్స్ ధరించిన ఇద్దరు యువతీ యువకులు బైక్ పై రొమాన్స్ చేస్తూ హల్ చల్ చేశారు!

అవును... ఇటీవల కాలంలో పబ్లిక్ ఎక్కువగా ఉండే రోడ్లపైనా, మెట్రో రైల్వే స్టేషన్స్ లోనూ, మెట్రో ట్రైన్స్ లోనూ అసభ్యకరమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ సమయంలో ఢిల్లీ రోడ్ల మీద ఇద్దరు యువతీ, యువకులు స్పైడర్ మెన్ సూట్ వేసుకుని రెచ్చిపోయారు. బైక్ మీద స్పెషల్ సూట్ వేసుకుని అందరని ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీలోని ద్వారాకనగర్ లో వీరు హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే... దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువతీ యువకులు స్పైడర్ మేన్ కాస్ట్యూమ్ లు వేసుకుని బైక్ ఎక్కారు.. అనంతరం రోడ్ల మీదకు వచ్చి నానా రచ్చా చేశారు. దీంతో... వీరి రచ్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి పోలీసుల కంటపడింది. దీంతో... రంగలోకి దిగిన పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా వారిని ట్రేసి చేశారు.

ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్న వారి పేరు ఆదిత్య, అంజలి అని తెలుస్తుంది. వీరిద్దరు ఇలా వెరైటీ గెటప్ లతో తరచు రోడ్లపై స్టంట్స్ చేస్తుంటారని పోలీసుల విచారణలో తెలిందని అంటున్నారు. వీరికి ఇన్ స్టాలో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వార్నింగ్ ఇచ్చి, జరిమాన విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.