Begin typing your search above and press return to search.

దేవుడా వీళ్లను వదలొద్దు: బాలికపై ఇద్దరు టీచర్ల సామూహిక అత్యాచారం

విన్నంతనే నోట మాట రానట్లుగా మారే అత్యంత దుర్మార్గమైన ఉదంతంగా దీన్ని చెప్పాలి

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:17 AM GMT
దేవుడా వీళ్లను వదలొద్దు: బాలికపై ఇద్దరు టీచర్ల సామూహిక అత్యాచారం
X

విన్నంతనే నోట మాట రానట్లుగా మారే అత్యంత దుర్మార్గమైన ఉదంతంగా దీన్ని చెప్పాలి. గురువు దైవంతో సమానమన్న విషయాన్ని మరిచి.. బాధ్యతను పక్కన పెట్టి.. కనుపాప మాదిరి చూసుకోవాల్సిన బాలికను తన స్కూల్లో పని చేసే టీచర్ తో కలిసి హెడ్డ్మాష్టర్ సామూహిక అత్యాచారం చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. విస్తుపోయేలా చేస్తోంది. పదకొండేళ్ల గిరిజన విద్యార్థినిపై జరపిని ఈ దారుణకాండ తాజాగా వెలుగు చూసింది.

నబరంగ్ పుర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని బాత్రూంలో ఉండగా.. హెడ్డ్మాష్టర్ తో కలిసి ఒక ఉపాధ్యాయుడు బలవంతంగా వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబరు ఏడున చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో షాకింగ్ గా మారింది. ఈ దారుణ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కానీ బయటకు రాలేదు. బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడటంతో తల్లిదండ్రులు ఏమైందని ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది.

వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లుగా పేర్కొన్నారు. ఆ వెంటనే.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించగా వారు ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. ఆ వెంటనే స్కూల్ హెడ్డ్మాష్టర్.. ఉపాధ్యాయుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. ఫోక్సోతో సహా మరికొన్ని సెక్షన్లు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పర్చగా.. వారికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం బాలికను నబరంగ్ పుర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారంపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న అత్యాచారాలపై ఆందోళన వ్యక్తమైంది.

ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై ఒడిశా మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ ఉదంతంపై పూర్తి నివేదిక అందించాలని ఆదేశించింది. బాలికకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ నాలుగు వారాల్లో ఈ అంశంపై తమకు నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. గురు స్థానంలో ఉండి ఇంత నీచానికి పాల్పడిన ఆ ఇద్దరికి ఒళ్లు జలదరించే శిక్షను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.