Begin typing your search above and press return to search.

నాలుగో తరగతి పిల్లాడు జామెట్రీ కంపాస్ తో 108సార్లు దాడి!

అమానుష ఘటన చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతంలో.. నాలుగో తరగతి చదివే పిల్లాడు ఇంత అమానుషంగా వ్యవహరించటమా?

By:  Tupaki Desk   |   28 Nov 2023 5:05 AM GMT
నాలుగో తరగతి పిల్లాడు జామెట్రీ కంపాస్ తో 108సార్లు దాడి!
X

అమానుష ఘటన చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతంలో.. నాలుగో తరగతి చదివే పిల్లాడు ఇంత అమానుషంగా వ్యవహరించటమా? అన్నది నమ్మలేని నిజంగా మారింది. పిల్లలు అన్న తర్వాత గొడవలు పడటం.. చిన్న చిన్న కొట్లాటలు మామూలే. కానీ.. తోటి విద్యార్థి మీద ఉన్న కోపంతో జామెట్రీ కంపాస్ తో 108 సార్లు విచక్షణరహితంగా పొడిచేసిన షాకింగ్ ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఇండోర్ నగరంలో జరిగిన ఈ ఉదంతం గురించి విన్నవారంతా ఆందోళన చెందుతున్నారు. ఇంటికి వచ్చిన తమ పిల్లాడు రక్తమోడుతూ రావటంతోఏం జరిగిందో తమకు అర్థం కాలేదని.. చివరకు పిల్లాడ్ని అడిగితే.. తన తోటి విద్యార్థి జామెట్రీ కంపాస్ తో 108సార్లు పొడిచినట్లుగా పేర్కొన్నాడు.అయితే.. క్లాస్ రూంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవటం లేదని బాధిత పిల్లాడి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి కోలుకుంటున్నాడు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడి చేసిన విద్యార్థి.. బాధిత విద్యార్థి ఇద్దరు పదేళ్లలోపు వయసు వాళ్లే. కొంతకాలంగా చిన్నారుల్లో నేర ప్రవ్రతి పెరిగిపోతుందని.. ముఖ్యంగా పేరెంట్స్ ఈ విషయంలో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఈ ఉదంతంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాల్సిన ఆదేశించింది. గొడవ జరిగిన సందర్భంలో పిల్లాడు ఇలా ప్రవర్తించాడని చెబుతున్నారు. నిందితుడైన విద్యార్థికి హింసాత్మక సన్నివేశాలు ఉండే వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? నాలుగో తరగతి చదివే పిల్లాడిలో ఇంతటి హింసాత్మక తీరు ఎలా సాధ్యం? అన్నది ప్రశ్నగా మారింది. స్కూల్ సిబ్బందికి.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.