Begin typing your search above and press return to search.

డీజే టిల్లు మూవీలాంటి సీన్.. మిస్ ఫైర్

రీల్ సీన్ లకు మించిన రియల్ సీన్లు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. హర్యానాలోని సోనిపట్ లో వెలుగు చూసిన వైనం.. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   12 April 2025 9:28 AM
డీజే టిల్లు మూవీలాంటి సీన్.. మిస్ ఫైర్
X

రీల్ సీన్ లకు మించిన రియల్ సీన్లు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. హర్యానాలోని సోనిపట్ లో వెలుగు చూసిన వైనం.. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. రీల్ లో ఓకే కానీ రియల్ లో సాధ్యమేనా? అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. తన గర్ల్ ఫ్రెండ్ ను ఎవరికీ తెలీకుండా సూట్ కేసులో కూర్చోబెట్టి తన హాస్టల్ లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక విద్యార్థి అడ్డంగా బుక్ అయ్యాడు. డీజే టిల్లు మూవీలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ శవాన్ని పెద్ద సూట్ కేసులో పెట్టి బయటకు తీసుకెళ్లే సీన్ గురించి తెలిసిందే.

అందులో శవాన్ని సూట్ కేసులో పెట్టి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు హీరోహీరోయిన్లు. అందులో సక్సెస్ అవుతారు కూడా. రియల్ లో అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకుంది. హర్యానాలోని సోనిపట్ లో ఉన్న జిందాల్ వర్సిటీకి చెందిన విద్యార్థి ఒకరు భారీ సూట్ కేసు తీసుకొని క్యాంపస్ లోని హాస్టల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో విద్యార్థి. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. సదరు సూట్ కేసు గురించి ఆరా తీశారు. బట్టలు.. వస్తువులు తీసుకెళుతున్నట్లు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది సూట్ కేసును తెరిచే ప్రయత్నం చేయగా.. సదరు విద్యార్థి అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఈ నేపథ్యంలో అక్కడి సిబ్బంది సూట్ కేసు తెరవగా.. అందులో నుంచి ముడుచుకొని కూర్చున్న ఒక అమ్మాయి బయటకు రావటంతో అక్కడి వారంతా అవాక్కు అయిన పరిస్థితి. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. అయితే.. ఆ అమ్మాయి అదే వర్సిటీకి చెందిన అమ్మాయా? వేరే అమ్మాయా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ సీక్రెట్ ను చేధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.