Begin typing your search above and press return to search.

అసోం సీఎం చేసిన పని దేశమంతా చేయాల్సిందే

మొన్నటికి మొన్న అసోంకు చెందిన విపక్ష నేత ఒకరు పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం కలకలాన్ని రేపింది. అలాంటివారిపై చర్యలు తీసుకోవాల్సిందే.

By:  Tupaki Desk   |   27 April 2025 4:26 AM
అసోం సీఎం చేసిన పని దేశమంతా చేయాల్సిందే
X

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అనుక్షణం తీసే శ్వాస మొత్తం ఈ నేల మీద అయినప్పుడు.. ఈ దేశానికి విధేయులుగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశీయులకు అలాంటి భావనను ఆశించటం అత్యాశే అవుతుంది. కానీ.. దేశ ప్రజల్లో కూడా ఇలాంటి భావన ఆశించకూడదా? అన్నట్లుగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. దేశీయులుగా ఉంటూ శత్రుదేశాన్ని అభిమానించే వారి తాట తీయాల్సిన టైం వచ్చింది. అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ.. చర్యలు తీసుకోవాల్సిన అవసంర ఉంది.

ఓవైపు దేశం మీద దాడి చేస్తూ.. అమాయకులైన పౌరుల్ని అత్యంత దారుణంగా చంపేస్తున్న దుర్మార్గుల సంగతి చూడాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న వారి విషయంలో రాష్ట్రాలు.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న అసోంకు చెందిన విపక్ష నేత ఒకరు పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం కలకలాన్ని రేపింది. అలాంటివారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అసోం రాష్ట్ర ప్రభుత్వం సదరు ఎమ్మెల్యేను అరెస్టు చేయటం తెలిసిందే.

అసోం రాష్ట్రానికి చెందిన కొందరు పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న వైనాన్ని గుర్తించిన ప్రభుత్వం.. అలాంటి వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసింది. ఇప్పటివరకు పాక్ అనుకూల వ్యాఖ్యలు చేసిన 14 మందిని అరెస్టు చేసినట్లుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు.

అవసరమైతే వారిని జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. భారత్ - పాకిస్థాన్ మధ్య ఎలాంటి సారూప్యతలు లేవు. ఈ రెండూ శత్రుదేశాలు. మనమూ అలాగే ఉండాలన్న అసోం సీఎం.. భారత వ్యతిరేక్ వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసే విషయంలో మిగిలినరాష్ట్రాల కంటే ముందు ఉన్నారు. ఈ తీరును మిగిలిన రాష్ట్రాలు అనుసరించటమే కాదు.. అలాంటి దుర్మార్గుల తాట తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.