'స్త్రీ శక్తి'తో మీకెంత లాభమో తెలుసా?
ఏపీలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తాజాగా అమలు చేసిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకంలో ఆయా వర్గాల మహిళలకు ఒనగూరే ప్రయోజనం ఎంత? అనేది ఆసక్తిగా మారింది .
By: Garuda Media | 16 Aug 2025 8:45 AM ISTఏపీలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తాజాగా అమలు చేసిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకంలో ఆయా వర్గాల మహిళలకు ఒనగూరే ప్రయోజనం ఎంత? అనేది ఆసక్తిగా మారింది . ఏ ప్రభుత్వమైనా.. ఒక పథకం అమలు చేయడం ద్వారా తన క్రెడిట్ చూసుకుంటుంది. వచ్చే ఎన్నికల నాటికి దాని ద్వారా మేలు దక్కించుకోవాలని భావిస్తుంది. అలానే, ప్రజలు కూడా తమకు ప్రభుత్వం చేసే మేలు ఎంత? అని లెక్కలు వేసుకుంటారు. ఇలా.. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు లాభమెంత? అనేది ఆసక్తిగా మారింది.
ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పించడం ద్వారా.. 4 రకాలుగా మహిళలకు ప్రయోజనం కలగ నుంది. ఆయా వర్గాల మహిళలు ఉచితంగా ప్రయాణించడం వల్ల.. వ్యక్తిగతంగా ఒక్కొక్క మహిళకు నెలకు 1500 రూపాయల వరకు మేలు కలుగుతుంది. అది నిత్యం ప్రయాణించేవారైతే.. అలా కాకుండా.. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారికి ఒక్కట్రిప్పునకు.. దూరాన్ని బట్టి కనీసంలో కనీసం 2000 రూపాయల వరకు లబ్ధి కలుగుతుంది. ఇక, నిత్యం ఆఫీసులకు, వ్యాపారాల కోసం ప్రయాణించే మహిళలకు.. నెలకు సుమారు 3500 రూపాయల వరకు మేలు జరుగుతుంది.
ఏయే మహిళలకు ఎంతెంత ప్రయోజనం..
+ ఇంటి నుంచి రోజూ ఆఫీసుకు రెండు బస్సులు మారి వెళ్లే మహిళలకు.. నెలకు సుమారు రూ.4200 వరకు ఆదా. నెలలో 25 రోజులు ఆఫీసుకు వెళ్లినా.. వీరికి నెలకు సుమారు 4000లకు పైగానే అవుతుంది. ఇప్పుడు ఆ సొమ్ము మిగలనుంది.
+ మార్కెట్లకు వెళ్లి వ్యాపారాలు చేసుకునేవారికి కూడా నెలకు 1500 నుంచి రూ.2000 వరకు ఆదాకానుంది.
+ వైద్యం కోసం, ఇతర అవసరాల కోసం.. వివిధ ప్రాంతాలకు వెళ్లి మహిళలకు .. రెండు వైపుల రాకపోకల చార్జీలకు ఒక్క ట్రిప్పునకు రూ.100 వరకు మిగులుతుంది. అలా నెల మొత్తం లెక్కించుకుంటే.. రూ.3000 వరకు లబ్ధి చేకూరుతుంది.
+ ఇక, ఆలయాలు.. దూర ప్రాంతాలు, చుట్టాల ఇళ్లకు వెళ్లే వారికి ఆయా దూరాన్ని బట్టి .. ఒక్క ట్రిప్పునకు ఒకవైపు.. రూ.800 చొప్పున వేసుకున్నా.. రెండు ట్రిప్పల్లో కలిపి సుమారు 1600 వరకు మిగులుతుంది.
+ ఇలా.. స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకునే తీరును బట్టి మహిళలకు ప్రయోజనం కలుగుతుంది.
+ ఇది ఒక కుటుంబంలో ఒక్కరికి లెక్కించి చెప్పి లెక్క. కానీ, అదే కుటుంబంలో ఇద్దరు మహిళలు ఉంటే.. ఇది మరింత డబుల్ దమాఖా అన్నమాట.
ఏమేం కావాలి..?
+ స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకునేందుకు మహిళలు ఏదైనా గుర్తింపు కార్డును చూపించాలి.
+ సదరు కార్డు చెల్లేలా ఉండాలి.
+ ఆధార్ కార్డు అన్నింటికీ మంచిది.
+ ప్రభుత్వం కేటాయించిన ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.
