Begin typing your search above and press return to search.

ఇవాళ స్టాక్ మార్కెట్లు ఎందుకు పని చేస్తున్నాయి?

దీంతో.. సోమవారం ప్రత్యేకంగా సెలవు కావటంతో.. అందుకు బదులుగా ఈ రోజు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 4:56 AM GMT
ఇవాళ స్టాక్ మార్కెట్లు ఎందుకు పని చేస్తున్నాయి?
X

అవను.. ఈ రోజు (శనివారం) స్టాక్ మార్కెట్లు పని చేస్తున్నాయి. సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ట్రేడింగ్ జరుగుతుంది. శని.. ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు అన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు (జనవరి 20) స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్ఈ.. ఎన్ఎస్ఈలు పని చేస్తున్నాయి. ఎందుకిలా అంటే.. అయోధ్య ఎఫెక్టుగా చెప్పాలి. అయోధ్యలోని రామమందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును (సోమవారం) సెలవును ప్రకటించింది.

దీంతో.. సోమవారం ప్రత్యేకంగా సెలవు కావటంతో.. అందుకు బదులుగా ఈ రోజు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ రోజు (శనివారం) ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాలని భావించారు. ఈక్విటీ.. ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగా రెండు సెషన్లలో కొద్ది గంటలు ట్రేడింగ్ జరిగేలా చూడాలని అనుకున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 9.15 గంటలకు ట్రేడింగ్ మొదలు పెట్టి.. పది గంటల వరకు ప్రాథమిక సైట్ లో.. 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు డిజాస్టర్ రికవరీ సైట్లో స్పెషల్ ట్రేడింగ్ ను నిర్వహించేలా ప్లాన్ చేశారు. అయితే.. 22న సెలవుగా ప్రకటించటంతో.. ఎప్పటి మాదిరే.. ఈ ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రేడింగ్ చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు.. జనవరి 22న మనీ మార్కెట్లు పని చేయవని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.