Begin typing your search above and press return to search.

స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారు తెలుగు రాష్ట్రాల్లో అంత తక్కువా?

ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వృద్ధికి భిన్నంగా భారత ఆర్థిక పరిస్థితి పరుగులు తీస్తున్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ ఇదే జోష్ కంటిన్యూ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2023 2:30 PM GMT
స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారు తెలుగు రాష్ట్రాల్లో అంత తక్కువా?
X

ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వృద్ధికి భిన్నంగా భారత ఆర్థిక పరిస్థితి పరుగులు తీస్తున్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ ఇదే జోష్ కంటిన్యూ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. దేశంలోని సానుకూల పరిస్థితులకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు మరింతగా పుంజుకుంటున్నాయి. కరోనా వేళ 8000 మార్కు వద్ద ఉన్న నిఫ్టీ ఇప్పుడు 21,700 పాయింట్లతో జీవితకాల గరిష్ఠానికి చేరుకోవటం తెలిసిందే.

సెంటిమెంట్ బలంగా ఉండటం.. వివిధ సంస్థలు విడుదల చేస్తున్న రిపోర్టుల్లో భారత వృద్ధిరేటు మాంచి జోరు మీద ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. దేశీయ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులుపెట్టే వారి సంఖ్య ఈ ఏడాది భారీగా పెరగటం గమనార్హం. ఈ ఏడాది మదుపుదారుల సంఖ్య తొలిసారి 8 కోట్లకు చేరుకోవటం విశేషం. గత ఏడాది డిసెంబరు 31తో పోలిస్తే.. ఈ ఏడాది మదుపరుల సంఖ్య పెరిగినట్లుగా తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే ఈ ఏడాది 22.4 శాతం పెరిగింది. ఇదిలాఉంటే.. అత్యధిక స్టాక్ మార్కెట్ మదుపరులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. రెండో స్థానంలో అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ నిలవటం ఆసక్తికరంగా మారింది. మూడో స్థానంలో గుజరాత్ నిలిచింది. డిసెంబరు 2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 6.94 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది డిసెంబరు 25నాటికి ఈ సంఖ్య 8.49 కోట్లకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే కోటి మందికి పైగా మదుపరులు పెరగటం విశేషం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర (1.48కోట్లు).. ఉత్తరప్రదేశ్ (89.47 లక్షలు).. గుజరాత్ (76.68 లక్షలు) మూడో స్థానంలో నిలవగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదీ టాప్ 5లో నిలవకపోవటం గమనార్హం.