Begin typing your search above and press return to search.

పోలింగ్ ముందే రాష్ట్ర సరిహద్దుల్ని మూసేస్తారట!

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరిగే నవంబరు 30కు రెండు రోజులు ముందు అంటే 28 నుంచి రాష్ట్ర సరిద్దుల్ని మూసేయనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 4:12 AM GMT
పోలింగ్ ముందే రాష్ట్ర సరిహద్దుల్ని మూసేస్తారట!
X

తెలంగాణ అసెంబ్లీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాల్ని వెల్లడించింది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ దశ పూర్తి కావటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు (నవంబరు 3) నుంచి నామినేషన్ పర్వానికి తెర తీయనున్నారు. ఈ నెల 30న కీలకమైన పోలింగ్ జరగనుంది. డిసెంబరు మూడున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరిగే నవంబరు 30కు రెండు రోజులు ముందు అంటే 28 నుంచి రాష్ట్ర సరిద్దుల్ని మూసేయనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ ముందు.. రాష్ట్ర సరిహద్దుల్ని మూసేసి..బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రచీఫ్ సెకట్రరీ.. డీజీపీలు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నట్లుగా సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. నవంబరు 28నుంచి పోలింగ్ జరిగే నవంబరు 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించినట్లుగాచెప్పారు. అయితే.. రాష్ట్ర సరిహద్దుల్ని మూసి వేయటం.. ఇతరులను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉంచడటం అన్న అంశాన్ని..ఎలా అమలు చేస్తారు? అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.