Begin typing your search above and press return to search.

స్టార్ లింక్ సేవల్ని సొంతం చేసుకోవటానికి ఎంత ఖర్చు అవుతుంది?

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్ లింక్ గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jun 2025 11:00 AM IST
స్టార్ లింక్ సేవల్ని సొంతం చేసుకోవటానికి ఎంత ఖర్చు అవుతుంది?
X

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్ లింక్ గురించి తెలిసిందే. మొన్నటివరకు భారత్ వెలుపల సేవలు అందించిన ఈ సంస్థకు తాజాగా దేశంలో తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు వీలుగా అనుమతులు కేటాయించటం తెలిసిందే. మరో ఏడాది వ్యవధిలో వినియోగదారులకు సేవలు అందించేందుకు వీలున్న వేళ.. స్టార్ లింక్ సేవల టారిఫ్ ఎంత ఉండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం సంస్థ ఎదురు చూస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ఆధారంగా చూస్తే.. స్టార్ లింక్ సేవల్ని సొంతం చేసుకోవాలంటే అపరిమితడేటా పథకాన్ని నెలకు రూ.3వేలు చొప్పున అందించేలా ప్లాన్ చేస్తుందని చెబుతున్నారు. 600-700 జీబీపీఎస్ వేగంతో డేటా సేవల్ని అందించే స్టార్ లింక్ సంస్థ.. తన వినియోగదారులు సేవల్ని సొంతం చేసుకోవటానికి ఒక కిట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కిట్ విలువ రూ.33వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

శాట్ కామ్ సేవలకు అవసరమైన లైసెన్సును ఈ నెల ఆరున సొంతం చేసుకున్న సంస్థ.. తన వ్యాపార కార్యకలాపాల్ని వీలైనంత త్వరగా ప్రారంభించేలా ప్లాన్ చేస్తోంది. స్టార్ లింక్ సొంతం చేసుకున్న శాట్ కామ్ సేవలు ఇంతకు ముందు భారతీ ఎయిర్ టెల్ కు చెందిన వన్ వెబ్.. రిలయన్స్ జియోకు చెందిన శాటిలైట్ విభాగానికీ అనుమతులు లభించాయి.

అంటే.. ఈ తరహా సేవల్ని దేశంలో అందించేందుకు మూడు సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్న మాట. స్టార్ లింక్ సేవల్ని ఇప్పటికే బంగ్లాదేశ్ లో అందిస్తున్నారు. ఆ దేశంలో రూ.33 వేలకు ఆరంభ కిట్ ను కొనుగోలుచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా రూ.3 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. జపాన్.. మలేషియా.. ఇండొనేషియా.. ఫిలిప్పీన్స్.. భూటాన్ లలోనూ స్టార్ లింక్ తన కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది.

నివాస ప్రాంతాల్లో రెసిడెన్షియల్ లైట్ పేరుతో నెలకు రూ.2600 - 3000చొప్పున వసూలు చేస్తూ.. రూ.4వేలు - 6 వేల రుసుముతో స్టాండర్డ్ పథకాల్ని అందిస్తోంది. బంగ్లాదేశ్ లో అనుసరిస్తున్న విధానాన్ని భారత్ లోనూ అమలు చేసే వీలుందని చెబుతున్నారు. ఆరంభ కిట్ తో పాటు ఏడాది పాటు సేవల్ని అందించేందుకు వీలుగా రూ.66వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ తరహా ప్లాన్ ను భారత్ లో అమలు చేసే అవకాశం ఉందంటున్నారు.