Begin typing your search above and press return to search.

సీఎం కాదు... 40 ఇవ్వండి పీఎంని డిసైడ్ చేద్దాం!

ఈ సందర్భంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 40స్థానాల్లోనూ గెలిస్తే ప్రధాని అభ్యర్థిని డీఎంకే డిసైడ్ చేస్తుందని సీఎం స్టాలిన్ తెలిపారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:30 PM GMT
సీఎం కాదు... 40 ఇవ్వండి  పీఎంని డిసైడ్  చేద్దాం!
X

ఈసారి ప్రధానిని నిర్ణయించే విషయంలో తమ పాత్ర కీలకంగా ఉండాలని దక్షిణాదిలో.. ప్రధానంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో భావిస్తున్నాయని.. ఈ విషయంలో అస్సలు తగ్గొద్దని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఆ దిశగానే ఆలోచన చేస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా పార్టీ శ్రేణులకు 2024 లోక్ సభ ఎన్నికల కోసం ఈ మేరకు పిలుపునిచ్చారు.

అవును... 2024 లోక్‌ సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చెన్నైలో జరిగిన డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో మాట్లాడిన ఆయన... తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించేలా చూడాలని కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని పిలుపునిచ్చారు.

ఈ సమయంలో డిసెంబరు 15న రాష్ట్రవ్యాప్తంగా 100 బహిరంగ సభలు నిర్వహించాలని, కూటమి పార్టీలకు చెందిన నేతలు అందరూ పాల్గొనేలా భారీ స్థాయిలో ఒక బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది! డీఎంకే అగ్రనేత కె అన్బళగన్ శతజయంతి సంవత్సరం సందర్భంగా భారీ కార్యక్రమం డిసెంబర్ 18న ఉత్తర చెన్నైలో జరగనుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సందర్భంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 40స్థానాల్లోనూ గెలిస్తే ప్రధాని అభ్యర్థిని డీఎంకే డిసైడ్ చేస్తుందని సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ సమయంలో... గత మూడేళ్లుగా డీఎంకే ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని శ్రేణులకు పిలుపిచ్చారు. పొత్తుల అంశం పార్టీ అధిష్టాణానికి విడిచిపెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నిత్యం ప్రజల మధ్యలో ఉన్న నేతలే డీఎంకే అభ్యర్థులు అని స్టాలిన్ నొక్కి చెప్పారు.

కాగా... ఈ ఏడాది సెప్టెంబరులో జిల్లా కార్యదర్శులు నియమితులైన తర్వాత వారితో ఈ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా.. పొత్తులపై ఆందోళన చెందవద్దని, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించాలని స్టాలిన్ జిల్లా కార్యదర్శులను కోరారు. ఇదే సమయంలో... బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసే సమయంలో తగిన శ్రద్ధ వహించాలని కోరారు.

మరోపక్క తాజాగా చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో దివంగత మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్‌ ను ముఖ్య అతిథిగా సీఎం ఆహ్వానించడంతో తాజాగా సరికొత్త రాజకీయ ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి. జాతీయ రాజకీయాల్లో డీఎంకే మరింత కీలక భూమిక పోషించాలి అనే ఆలోచన దీని వెనుక ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమానికి అఖిలేష్‌ తో పాటు దివంగత వీపీ సింగ్ కుటుంబ సభ్యులను ఈ స్టాలిన్ ఆహ్వానించారు.