బొజ్జలకు పని పెంచేసిన వైసీపీ.. ?
దీనికి కారణం.. ఎన్నికల తర్వాత.. ఎక్కడున్నారో కూడా తెలియని విధంగా తప్పుకొన్న వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వడమే.
By: Tupaki Desk | 9 May 2025 4:30 PM``శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు ఉన్న రాజకీయాలు వేరు.. ప్రస్తుతం మారిన రాజకీయాలు వేరు.. ఇప్పుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి పని పెరిగిపోయింది!.``అని టీడీపీ నాయకులు వ్యా ఖ్యానిస్తున్నారు. దీనికి కారణం.. ఎన్నికల తర్వాత.. ఎక్కడున్నారో కూడా తెలియని విధంగా తప్పుకొన్న వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వడమే. అంతేకాదు.. ఇక.. పూర్తిస్థాయిలో ప్రజలకు అండగా ఉంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
2024 ఎన్నికల తర్వాత.. పలువురు వైసీపీ నాయకులు మౌనంగా ఉన్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడున్న పరిస్థితిలో నోరు ఎత్తితే.. కేసులు చుట్టుకుంటా యని అనుకున్నారు. ఇలానే.. శ్రీకాళహస్తిమాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు కూడా.. హైదరాబాద్‌లోనే తిష్ఠ వేశారు. అయితే.. ఇటీవల ఆయనకు ఫండింగ్ చేసే ఒక కలప వ్యాపారి దుకాణంలో చందనం దుంగలకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఆయన లబోదిబోమన్నారు.
పార్టీకి ఎంతో ఫండింగ్ చేశానని.. కానీ, కష్ట కాలంలో తనను పట్టించుకోవడం లేదని మీడియా ముందుకు వచ్చారు. ఈ పరిణామాలతో బియ్యపు మధు.. హైదరాబాద్ నుంచి వెంటనే నియోజకవర్గంలో వాలిపో యారు. ఆ వెంటనే.. ఆయన టీడీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులపైనా.. తన అనుచరుల పైనా దాడులు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇక, నుంచి ప్రజల మధ్యే ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ పరిణామాలు.. ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు ఆయన ఎలా వ్యవహరించినా.. ఇప్పుడు మాత్రం వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంతో పాటు.. తనను తాను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదేసమయంలో రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడమో.. లేక వైసీపీకి ఝలక్ ఇచ్చే వ్యవహారాలు చేయడమో చేయాలి. ఈ విషయంలో బొజ్జలకు చాలానే పని పడిందని అంటున్నారు టీడీపీ నాయకులు. మరి ఆయన ఎలా ముందుకు సాగుతారో చూడాలి. ఏదేమైనా.. శ్రీకాళహస్తి రాజకీయాలు .. ఇక, నుంచి యూటర్న్ తీసుకుంటాయని అంటున్నారు.