Begin typing your search above and press return to search.

విమాన మంత్రి ఆ పని చేస్తే పదివేలు

దేశంలో అనేక రాష్ట్రాలు రైల్వే మంత్రిత్వ శాఖను చేపట్టాయి. వాటి వల్ల ఆయా రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందాయి.

By:  Satya P   |   22 March 2026 8:45 AM IST
విమాన మంత్రి ఆ పని చేస్తే పదివేలు
X

దేశంలో అనేక రాష్ట్రాలు రైల్వే మంత్రిత్వ శాఖను చేపట్టాయి. వాటి వల్ల ఆయా రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందాయి. కానీ ఏపీకి ఎందుకో కానీ మాత్రం ఆ సౌభాగ్యం కలుగలేదు. రైల్వే శాఖ సహాయ మంత్రులు తప్పించి కేబినెట్ మంత్రులు ఎపుడూ లేరు. ఉత్తరాంధ్రాకు పౌర విమాన యాన మంత్రులు మాత్రం గత పదేళ్ళలో ఇద్దరు వచ్చారు. విమానాలు అవసరమే కానీ వాటి కంటే ముందు రైళ్ళు సగటు జనాలకు చాలా అవసరం అన్నది తెలిసిందే.

ఎయిర్ పోర్టు తెస్తామని :

విమాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే శ్రీకాకుళానికి ఎయిర్ పోర్టు తెస్తామని ప్రకటించారు. అయితే అది అధిక సంఖ్యాకం ప్రజలను మెప్పించలేకపోతోంది. ముందు శ్రీకాకుళం జిల్లాలో రైళ్ల సంగతి చూడండి అని వేడుకున్నారు.ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడు అయితే కేంద్ర రైల్వే మంత్రిని కలసి శ్రీకాకుళం జిల్లా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. లేటెస్ట్ గా ఆయన జిల్లాలోని కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ లో విశాఖ - గుణపూర్ పాసింజర్ రైలు హాల్ట్ ను ప్రారంభించారు.మందస రోడ్ రైల్వే స్టేషన్ లో బెర్హంపూర్ విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ ని పాతపట్నం లో రూర్కెల గుణపూర్ రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ ల నూతన హాల్టు ను ప్రారంభించారు.

జిల్లాకు మేలు అని :

ప్లాట్ ఫాం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, స్టాపేజి వంటివి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. రానున్న రోజులలో శ్రీకాకుళం నుంచి నేరుగా హైదరాబాద్ కి తిరుపతికి రైల్ సర్వీసులు ఏరాటు చేస్తామని చెబుతున్నారు. అదే తన లక్ష్యమని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితేనే జిల్లాకు మేలు అని అంతా అంటున్నారు. ఆ విధంగా సాధించుకుని వస్తే కనుక విమాన మంత్రి ప్రజా రవాణాని ప్రాధాన్యత ఇచ్చినట్లే అంటున్నారు.