దువ్వాడ విత్ జగన్...ప్లాన్ బీ కూడా ఉందిట !
శ్రీకాకుళానికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ఆవరణలో జగన్ ని కలిసారు.
By: Satya P | 12 Feb 2026 9:23 AM ISTశ్రీకాకుళానికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ఆవరణలో జగన్ ని కలిసారు. ఆయన జగన్ తో కొద్ది సేపు మాట్లాడే ప్రయత్నం చేశారు. జగన్ వైపు నుంచి చూస్తే తరువాత మాట్లాడుకుందామని అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ ని కలిసిన దువ్వాడ శ్రీనివాస్ తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు కోపమంతా ధర్మాన బ్రదర్స్ మీద తప్ప జగన్ మీద కాదని అంటున్నారు. అయితే జగన్ దువ్వాడకి హామీ ఇవ్వాలన్నా ఆయన మీద వేసిన సస్పెన్షన్ వేటుని వెనక్కి తీసుకోవాలన్నా కూడా జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో చర్చించాల్సి ఉంటుంది.
నో అంటూ బ్రదర్స్ :
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో వర్గాలకు కొదవ లేదు. ధర్మాన బ్రదర్స్ పార్టీ మీద పట్టు సాధించారు అని గిట్టని వర్గాలు సామాజిక వర్గాలు గుర్రు మంటున్నాయి. వైసీపీలో ఉన్నా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీ పెద్దల తీరు జిల్లా నేతల తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గం అయితే వైసీపీలో తమకు తగిన స్థానం లేదని మధనం చెందుతోంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీలో తీసుకోవాలన్నా సమస్యగానే ఉంటుంది, వద్దని చెప్పినా సమస్యగానే ఉంటుంది అని అంటున్నారు. తమ మీదనే విమర్శలు చేస్తున్న దువ్వాడకు హైకమాండ్ ఓకే చెబితే ధర్మాన సోదరులు రివర్స్ అవుతారు అని అంటున్నారు దాంతో జిల్లా పార్టీని వారి మీదనే పెట్టిన జగన్ కి ఇది ఇబ్బందికరమైన విషయమే అని అంటున్నారు.
సత్తా చాటుతారా :
ఇక జగన్ అంటే తనకు ఇష్టమని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. మరి జగన్ కూడా ఆయనను ఆదరించి పార్టీలోకి తిరిగి ఆహ్వానిస్తే అంతా ఓకేగా ఆయన వైపు నుంచి ఉంటుందని అంటున్నారు. అలా కాదూ కూడదు అంటే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ తన సొంత సత్తా చాటేందుకు సిద్ధపడతారు అని అంటున్నారు. ఆయన సొంతంగా పోటీ చేయాలని చూస్తున్నారు అని కూడా చెబుతున్నారు. ఆ విధంగా ప్లాన్ బీని సిద్ధం చేసుకున్న మీదటనే జగన్ తో భేటీకి ప్రయత్నం చేశారు అని చెబుతున్నారు.
సామాజిక వర్గం దన్ను :
కాళింగులు శ్రీకాకుళం జిల్లాలో హెచ్చు సంఖ్యలో ఉన్నారు. దాంతో వారి మద్దతుతో జిల్లాకు మాత్రమే పరిమితం అయ్యేలా ఒక చిన్న గ్రూప్ ని ఏర్పాటు చేసి కొంతమంది కాళింగ నాయకులను ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటుకు పోటీకి దించాలని శ్రీకాకుళం జిల్లా కాళింగ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. మరి దువ్వాడ కూడా దానికి సై అంటే వైసీపీకి ఆ విధంగా చూసినా ఇబ్బందికరమే అని చెబుతున్నారు. మొత్తానికి దువ్వాడ అయితే వైసీపీ పెద్దల గ్రౌండ్ లోకే బంతికి వదిలారు అని అంటున్నారు. మరి రియాక్షన్ ఇవ్వాల్సింది వైసీపీ పెద్దలే అని అంటున్నారు.
