Begin typing your search above and press return to search.

సినీ నటి శ్రీదేవిపై ఆమె చేపిన పత్రాలన్నీ ఫేక్?

అయితే.. ఆమె చూపించే పత్రాలు మొత్తం నకిలీవిగా పేర్కొంటూ ముంబయికి చెందిన న్యాయవాది చాందినీ షా తెర మీదకు వచ్చారు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 4:39 AM GMT
సినీ నటి శ్రీదేవిపై ఆమె చేపిన పత్రాలన్నీ ఫేక్?
X

సినీనటిగా.. అతిలోక సుందరిగా పేరున్న శ్రీదేవి 2018 ఫిబ్రవరిలో దుబాయ్ లో మరణించటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతంపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాటిని యూట్యూబ్ లో ప్రస్తావిస్తూ.. తాను సొంతంగా దర్యాప్తు చేసినట్లుగా చెప్పుకునే దీప్తి ఆర్.

పిన్నిటిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. భువనేశ్వర్ కు చెందిన ఆమె తన వాదనలకు బలాన్ని చేకూర్చేలా చూపే డాక్యుమెంట్లు మొత్తం ఫేక్ గా సీబీఐ తేల్చింది. యూట్యూబ్ చానల్ లో శ్రీదేవి మరణంపై మరిన్ని అనుమానాలు తలెత్తేలా చేసే వాదనలు.. వాటికి ఆధారంగా చూపించే పత్రాల్లో ఏ మాత్రం నిజం కావని స్పష్టం చేసింది.

యూఏఈ.. భారత్ ప్రభుత్వాలు శ్రీదేవి మరణాన్ని దాచినట్లుగా ఆమె ఆరోపించేవారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ లేఖలతో పాటు.. సుప్రీంకోర్టు.. యూఏఈ ప్రభుత్వాలకు చెందిన డాక్యుమెంట్లను సైతం ఆమె తన వీడియోల్లో ప్రదర్శించేవారు.

అయితే.. ఆమె చూపించే పత్రాలు మొత్తం నకిలీవిగా పేర్కొంటూ ముంబయికి చెందిన న్యాయవాది చాందినీ షా తెర మీదకు వచ్చారు. సీబీఐను ఆశ్రయించారు. ఆయన ఫిర్యదు నేపథ్యంలో రంగంలోకి దిగిన సీబీఐ.. ఆమె చూపే పత్రాలన్ని ఫేక్ గా తేల్చారు.

తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే.. సీబీఐ కేసుపై దీప్తి వాదన వేరేలా ఉంద. తన వాంగ్మూలాన్ని నమోదు చేయకుండా సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయటం దారుణమని పేర్కొన్నారు. మొత్తంగా శ్రీదేవి మరణంపై మిస్టరీ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రచారం చేసే దీప్తి మాటల్లో నిజం లేదన్న విషయం తాజా పరిణామాలతో స్పష్టమైందని చెప్పాలి.