Begin typing your search above and press return to search.

బాలయ్య చిన్నల్లుడుకి బిగ్ ట్రబుల్స్...!

ఆయన ఈసారి కచ్చితంగా గెలుస్తాను అని నమ్ముతున్నారు. గతసారి కూడా కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిన శ్రీ భరత్ ఈసారి వీజయం తనదే అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 3:49 AM GMT
బాలయ్య చిన్నల్లుడుకి బిగ్ ట్రబుల్స్...!
X

విశాఖ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి టీడీపీ తరఫున బాలయ్య చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ కర్చీఫ్ వేసేశారు. ఆయన చాలా కాలంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. ఆయన ఈసారి కచ్చితంగా గెలుస్తాను అని నమ్ముతున్నారు. గతసారి కూడా కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిన శ్రీ భరత్ ఈసారి వీజయం తనదే అంటున్నారు.

అయితే శ్రీ భరత్ కి టికెట్ దక్కుతుందా అంటే బీజేపీతో పొత్తులు లేకపోతే ష్యూర్ అనే అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే విశాఖను అర్పించుకోవాల్సిందే అని అంటున్నారు. బీజేపీలో ఎంపీ టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసిం హారావు. అలాగే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే మాత్రం పురంధేశ్వరికే చాన్స్ అని అంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీతో పొత్తు అన్నది ఉండదని కూడా ప్రచారంలో ఉంది. అదే కనుక జరిగితే తెర మీదకు శ్రీ భరత్ వస్తారు. అంగబలం అర్ధబలం ఉన్న శ్రీ భరత్ కంటే బెస్ట్ క్యాండిడేట్ టీడీపీకి వేరొకరు లేరు అని అంటున్నారు. ఆయన కూడా పార్టీ క్యాడర్ తో కలసిపోయి ఎప్పటి నుంచో పనిచేసుకుంటూ పోతున్నారు.

విశాఖ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జిలతో ఆయన కలసి పార్టీని పటిష్టం చేస్తున్నారు. సో బీజేపీతో పొత్తు లేకపోతే భారత్ కి చాన్సెస్ పెరిగినట్లే అంటున్నారు. కానీ ఆయనకు బీసీ కార్డు రూపంలో మరో ఇబ్బంది ఉందని అంటున్నారు. అది కూడా మరో పొత్తు పార్టీ జనసేన నుంచి అంటున్నారు.

అదెలా అంటే పొత్తులో భాగంగా జనసేనకు గాజువాక అసెంబ్లీ టికెట్ ఇస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే గాజువాక మాజీ ఎమ్మెల్యే విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనను ఎక్కడో ప్లేస్ చూపించాల్సి ఉంది. దాంతో పాటు వైసీపీ ఈసారి ఎంపీ అభ్యర్థి విషయంలో బీసీ కార్డుని ప్రయోగిస్తుంది అని అంటున్నారు.

దాంతో టీడీపీ బీసీ అభ్యర్ధిగా పల్లా శ్రీనివాసరావును విశాఖ పార్లమెంట్ నుంచి పోటీకి దించవచ్చు అని అంటున్నారు 2009లో పల్లా శ్రీనివాసరావు జనసేన తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి ఓట్లను సంపాదించారు. దాంతో ఆయనకు ఎంపీగా పోటీ చేయడం కొత్త కాదు. పైగా యాదవ సామాజికవర్గం మద్దతు కూడా భారీగా దక్కుతుంది. అది ఎమ్మెల్యే అభ్యర్ధులకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా చాలా లెక్కలు వైసీపీ వేసుకుంటోంది అని అంటున్నారు.

మొత్తానికి బాలయ్య అల్లుడు ఎంపీ అభ్యర్ధిగా పోటీకి ఎంత ఉత్సాహం చూపుతున్నా పొత్తుల దెబ్బ అటూ ఇటూ గట్టిగానే ఉంది అని అంటున్నారు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తు మీద కొంత సందేహం అయితే ఉంది. అయితే ఆయన మాత్రం టికెట్ నాదే అని పర్యటనలు గట్టిగానే చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.