Begin typing your search above and press return to search.

శ్మశానం నుంచి ఎముకలతో డ్ర*గ్స్ తయారీ.. రూ.16 కోట్ల 'కుష్'తో బ్రిటిష్ యువతి అరెస్ట్!

శ్రీలంకలో కస్టమ్స్ అధికారులు ఒక సంచలన కేసును బయటపెట్టారు. కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 21 ఏళ్ల ఒక బ్రిటిష్ యువతిని 46 కిలోల నార్కోటిక్ డ్ర*గ్స్‌తో అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   28 May 2025 11:31 AM IST
శ్మశానం నుంచి ఎముకలతో డ్ర*గ్స్ తయారీ.. రూ.16 కోట్ల కుష్తో బ్రిటిష్ యువతి అరెస్ట్!
X

శ్రీలంకలో కస్టమ్స్ అధికారులు ఒక సంచలన కేసును బయటపెట్టారు. కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 21 ఏళ్ల ఒక బ్రిటిష్ యువతిని 46 కిలోల నార్కోటిక్ డ్ర*గ్స్‌తో అరెస్టు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ డ్ర*గ్ మానవ అస్థిపంజరాలతో తయారు చేయబడుతుంది. వాటిని స్మశానవాటికల నుండి దొంగిలిస్తున్నారని తేలింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.

అరెస్ట్ అయిన మహిళ పేరు షార్లెట్ మే లీ. ఈమె సౌత్ లండన్‌కు చెందినది. గతంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పని చేసింది. ఈ నెల ప్రారంభంలో కొలంబోలోని బందరనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆమెను పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న రెండు పెద్ద సూట్‌కేసులలో మొత్తం 46 కిలోల మత్తుపదార్థం లభ్యమైంది. దీని మార్కెట్ విలువ సుమారు 1.5 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.16 కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా. శ్రీలంక చరిత్రలోనే ఇది ఇప్పటివరకు పట్టుబడిన అత్యంత భారీ డ్ర*గ్స్ రవాణా కేసు.

షార్లెట్ మే లీ తన బ్యాగులో డ్ర*గ్స్ ఉన్నాయని తనకు తెలియదని వాదిస్తోంది. "నా బ్యాగులో ఎవరు పెట్టారో నాకు తెలుసు, కానీ వారి పేరు చెప్పదలుచుకోలేదు" అని ఆమె పేర్కొంది. "నేను నా సామాను అసలు ఓపెన్ చేయనే లేదు, అందులో నా బట్టలు మాత్రమే ఉన్నాయని అనుకున్నాను" అని ఆమె చెప్పింది. ప్రస్తుతం షార్లెట్‌ను కొలంబోకు ఉత్తరాన ఉన్న నెగొంబో జైలులో ఉంచారు.

ఈ డ్ర*గ్ పేరు 'కుష్'. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ముఖ్యంగా సియెరా లియోన్ దేశంలోని యువతలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ డ్ర*గ్ ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దీన్ని సేవించిన తర్వాత ప్రజలు నడుస్తూ నడుస్తూనే స్పృహ కోల్పోయి పడిపోతారు.. లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు వాహనాలకు ఢీ కొంటారు.

నివేదికల ప్రకారం, ఈ డ్ర*గ్‌ను తయారు చేయడానికి స్మశానవాటికల నుంచి మానవ ఎముకలు, అస్థిపంజరాలను దొంగిలిస్తారు. ఈ కారణంగా సియెరా లియోన్ ప్రభుత్వం 2024లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించి, స్మశానవాటికలను కాపలా కాయడానికి సైన్యాన్ని మోహరించింది. ఇది ఈ డ్ర*గ్ ఎంత ప్రమాదకరమైనదో దాని కోసం ఎంత దారుణాలకు పాల్పడుతున్నారో తెలియజేస్తుంది.

శ్రీలంక కస్టమ్స్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ఇటీవలి కాలంలో బ్యాంకాక్ నుండి డ్ర*గ్స్ అక్రమ రవాణా గణనీయంగా పెరిగింది. షార్లెట్ కూడా బ్యాంకాక్ నుండే శ్రీలంకకు చేరుకుంది. ఆమె ప్రొఫైలింగ్ ఆధారంగానే ఆమెను పట్టుకున్నారు. ఇదే సమయంలో, బ్యాంకాక్ నుంచి వచ్చిన మరొక బ్రిటిష్ యువతి బెల్లా కూలీ (18)ని జార్జియాలో 12 కిలోల గంజాయి, 2 కిలోల హషీష్‌తో పట్టుకున్నారు. ఆమెపై కూడా డ్ర*గ్స్ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆమెకు 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.