Begin typing your search above and press return to search.

ఏపీలో చీలే ఓట్ల లెక్క ఎంత‌.. జ‌గ‌న్ - బాబులో ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్‌...!

ఏపీలో ఓట్ల‌ను చీల్చ‌కుండా.. ఉంచాల‌నేది టీడీపీ-జ‌న‌సేన వ్యూహం. ఇలా అయితే.. త‌మ పంతం నెగ్గు తుందని.. వైసీపీని ఓడించ‌డం సుల‌వ‌వుతుంద‌ని పార్టీలు అంచ‌నా వేశాయి.

By:  Tupaki Desk   |   4 Feb 2024 4:30 PM GMT
ఏపీలో చీలే ఓట్ల లెక్క ఎంత‌.. జ‌గ‌న్ - బాబులో ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్‌...!
X

ఏపీలో ఓట్ల‌ను చీల్చ‌కుండా.. ఉంచాల‌నేది టీడీపీ-జ‌న‌సేన వ్యూహం. ఇలా అయితే.. త‌మ పంతం నెగ్గు తుందని.. వైసీపీని ఓడించ‌డం సుల‌వ‌వుతుంద‌ని పార్టీలు అంచ‌నా వేశాయి. అంచ‌నా బాగున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ప‌రిస్థితి మారింది. ఓట్ల చీలిక త‌ప్ప‌ద‌నే లెక్క‌లు వ‌స్తున్నాయి. దీంతో రాజ‌కీయంగా ఓట్ల చీలిక అంశం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల చేస్తున్న ప్ర‌చారంతో ఆ పార్టీకి కూడా.. క‌నీసం 1 నుంచి 2 శాతం ఓట్లు పెరిగే అవ‌కాశం ఉంటుంది.

జిల్లాల వారీగా చూసుకుంటే.. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ల్లో కాంగ్రెస్‌కు కేడ‌ర్ అంతో ఇంతో ఉండ డంతోపాటు ష‌ర్మిల ఇమేజ్ అక్క‌డ బాగానే ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, అదే స‌మ‌యంలో ఉమ్మ‌డి క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల లోనూ.. ష‌ర్మిల ప్ర‌భావం చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక్క‌డ కూడా ఓటు బ్యాంకు పెంచుకుని కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉంటుంద‌ని స‌మాచారం.

ఇదంతా కూడా వైసీపీకి సంబంధించిన ఓటు బ్యాంకేన‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నా. "చీలే ఓటంతా వైసీపీదే. కాంగ్రెస్ నుంచి ఒక‌ప్పుడు బ‌ట్వాడా అయిన ఓటు బ్యాంకు.. ఇప్పుడు తిరిగి ఆ పార్టీకి వ‌చ్చే అవ‌కాశం ఉంది" అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జేడీ శీలం వ్యాఖ్యానించారు. అంటే.. ఇది వైసీపీకి ఒక‌ర‌కంగా మైన‌స్ అవుతుంది. కానీ, ఇదే స‌మ‌యంలో టీడీపీ-జ‌న‌సేన‌కు ఈ చీలే ఓటు ద‌క్క‌క‌పోతే.. ఆ రెండు పార్టీల వ్యూహానికి మైన‌స్ అవుతుంద‌ని అంటున్నారు.

కొన్ని కొన్ని జిల్లాల్లో.. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు ప‌డినా.. ప‌డ‌క‌పోయినా.. టీడీపీ -జ‌నసేన మిత్ర‌ప‌క్షానికి మెజారిటీ ఓట్లే ప‌డ‌నున్నాయి. ఎందుకంటే.. ఇక్క‌డ ఈ కూట‌మిని ఆద‌రించే వారు ఎక్కువ‌గా ఉన్నారు. కానీ, మ‌రికొన్ని జిల్లాల్లో ఓటు చీలితేనే ఈ మిత్ర‌ప‌క్షం విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. దీంతో ఇలాంటి జిల్లాల్లో ఓటు చీలినా.. అది మిత్ర‌ప‌క్షానికి ఎలాంటి ఫ‌లితం లేకుండా చేస్తుంద‌ని అంటున్నారు. సో.. మొత్తానికి ఓటు చీలిక అనేది ఖాయ‌మే అయినా.. జిల్లాల‌ను బ‌ట్టి ఇది ప్ర‌భావం చూపుతుంద‌ని భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.