Begin typing your search above and press return to search.

మరో షాకింగ్... విమానం గాల్లో ఉండగా ఊడిన విండో ఫ్రేమ్‌!

ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 July 2025 1:20 PM IST
మరో షాకింగ్... విమానం గాల్లో ఉండగా ఊడిన విండో ఫ్రేమ్‌!
X

ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 260 మంది ప్రాణాలను మంటల్లో కలిపేయగా.. ఆ తర్వాత సాంకేతిక లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ లు, ఒకేసారి వేల అడుగుల కిందకు పడిపోవడాలు వంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ క్రమంలో... జపాన్ లో బోయింగ్ డ్రీమ్‌ లైనర్ 737 విమానం అకస్మాత్తుగా సుమారు 26,000 అడుగుల కిందకు దిగిపోయిన ఘటన తాజా ఉదాహరణ కాగా... జూన్ 14న ఢిల్లీ నుండి బయలుదేరిన విమానం సడన్ గా 900 అడుగుల మేర కిందికి దిగిపోయిన ఘటన మరో ఉదాహరణ. ఈ సమయంలో.. విమానం గాల్లో ఉండగా విండో ఫ్రేమ్ ఊడిన ఘటన తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల ప్రయాణికులను తీవ్ర టెన్షన్ పెడుతున్న విమాన ఘటనల్లో తాజాగా మరొకటి వచ్చి చేరింది. ఇందులో భాగంగా.. పుణె నుంచి గోవా వెళ్తున్న విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్‌ ఊడింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ వెల్లడించింది. అయితే.. ప్రయాణికుల భద్రతపై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొంది.

ఈ సందర్భంగా స్పందించిన స్పైస్ జెట్... క్యూ400 విమానంలోని ఒక కాస్మెటిక్‌ కిటికీ ఫ్రేమ్‌ వదులై ఊడినట్లు గుర్తించామని.. అప్పుడు విమానంలో పీడనం సాధారణంగానే ఉందని.. ఈ ఫ్రేమ్‌ కిటికీ వద్ద నీడ కోసం అమర్చిందే తప్ప ప్రత్యేక నిర్మాణం కాదని తెలిపింది. క్యూ400 విమానం బహుళ పొరల కిటికీ పలకలను కలిగి ఉంటుందని వెల్లడించింది.

మరోవైపు విమాన ప్రయాణ యోగ్యతను ప్రశ్నిస్తూ ఓ ప్రయాణికుడు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. దానికి విమానంలో ఊడిన కిటికీ ఫ్రేమ్‌ వీడియోను జోడించారు. ఇందులో భాగంగా.. అతీష్ మిశ్రా అనే వ్యక్తి విమానం గాల్లో ఉండగా ఒక విండో ఫ్రేమ్ ఊడిపోయిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.