Begin typing your search above and press return to search.

సీఎం కు స్పెషల్ సెక్యూరిటి

ముఖ్యమంత్రితో పాటు కుటుంబసభ్యుల భ్రదత కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని అనుకుంటున్న స్పెషల్ సెక్యూరిటి గ్రూప్ (ఎస్ఎస్జీ) బిల్లు పాసైంది.

By:  Tupaki Desk   |   23 Sept 2023 3:30 PM
సీఎం కు స్పెషల్ సెక్యూరిటి
X

ముఖ్యమంత్రితో పాటు కుటుంబసభ్యుల భ్రదత కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని అనుకుంటున్న స్పెషల్ సెక్యూరిటి గ్రూప్ (ఎస్ఎస్జీ) బిల్లు పాసైంది. ఈ బిల్లును హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రవేశపెట్టారు. బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి లేదా ఆయన కుటుంబసభ్యులకు ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ (ఏఆర్) భద్రత కల్పిస్తోంది. ఈ ఫోర్సులో కూడా సుశిక్షుతులైన పోలీసు అధికారులే ఉంటారు. రోప్ పార్టీ తదితరాలకు అయితే కానిస్టేబుల్, హెడ్ కాననిస్టేబుల్ స్ధాయి వాళ్ళుంటారు.

అదే ముఖ్యమంత్రి లేదా కుటుంబసభ్యులకు సమీపంలో ఉండే వాళ్ళంతా ఎస్ఐ, ఇన్ప్ పెక్టర్ స్ధాయి అధికారులే ఎక్కువగా ఉంటారు. సీఎం అయినా కుటుంబసభ్యులైనా ఎక్కడ పర్యటించినా విమానం, రైలు, బస్సు, పడవ ప్రయాణంలో కూడా వెన్నంటే ఉంటారు. ఉదయం, సాయంత్రం నడక సమయంలో కూడా భద్రతా సిబ్బంది కూడానే ఉంటారు. కాబట్టి 24 గంటలు, 365 రోజులు ముఖ్యమంత్రితో పాటు కుటుంబసభ్యులు ఫుల్లు సెక్యూరిటిలోనే ఉంటారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ జడ్ కేటగిరి ఉంటుంది. జడ్ అయినా జడ్ ప్లస్ అయినా కేటగిరి అయినా నేషనల్ సెక్యూరిటి గార్డ్స్, బ్లాక్ క్యాట్ కమేండోలుంటారు. కాకపోతే సంఖ్యలోనే తేడా ఉంటుంది. ముఖ్యమంత్రి సెక్యూరిటిగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఇన్ స్పెక్టర్ స్ధాయి వాళ్ళు తక్కువలో తక్కువ 200 మంది 24 గంటలూ విధినిర్వహణలోనే ఉంటారు.

ఇంతపటిష్టమైన సెక్యూరిటి ఉన్నపుడు మళ్ళీ కొత్తగా స్పెషల్ సెక్యూరిటి గ్రూప్ పేరుతో ప్రత్యేక భద్రతాదళాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్ధంకావటంలేదు. ఇపుడున్న అధికారుల్లోనే కొందరిని ఎంపికచేసి అత్యాధునిక సెక్యూరిటిలో అవసరమైన శిక్షణ ఇప్పించచ్చు. కానీ ప్రభుత్వం అలాచేయకుండా ఏకంగా ప్రత్యేకంగా ఒక భద్రతాదళం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. దీని ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు తదితర వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వం ప్రకటిస్తే కానీ పూర్తిస్ధాయి వివరాలు అర్ధంకావు. బహుశా ఎన్ఎస్జీ గార్డ్స్ తరహాలోనే ఎస్ఎస్జీ భద్రతాదళం ఏర్పాటు అవుతుందని అనుకుంటున్నారు.