Begin typing your search above and press return to search.

‘సర్’ మూడో విడతకు కేంద్రం ఓకే.. ఏయే రాష్ట్రాల్లో అంటే?

సింఫుల్ గా ‘సర్’ అని చెప్పేసినా.. దీన్ని మరింత వివరంగా చెప్పాలంటే.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాంగా చెప్పాలి.

By:  Garuda Media   |   15 May 2026 10:44 AM IST
‘సర్’ మూడో విడతకు కేంద్రం ఓకే.. ఏయే రాష్ట్రాల్లో అంటే?
X

సింఫుల్ గా ‘సర్’ అని చెప్పేసినా.. దీన్ని మరింత వివరంగా చెప్పాలంటే.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాంగా చెప్పాలి. ఇటీవల కాలంలో తీవ్ర చర్చకు దారి తీయటమే కాదు.. పెద్ద ఎత్తున వాదనలకు తెర తీసింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంపై కొందరు తీవ్ర విమర్శలు గుప్పించటం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల్లో చేపట్టిన ఈ కార్యక్రమం తాజాగా మూడో విడతకు కేంద్ర ఎన్నికల సంఘం సైరన్ మోగించింది. నకిలీ ఓటర్లకు చెక్ చెప్పి.. అర్హులకు చోటు కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమంగా దీన్ని చెప్పాలి.

తొలి.. రెండు దశల్ని పూర్తి చేసిన ఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) తాజాగా మూడో విడతకు తెర తీసింది. తొలి దశలో బిహార్ లో చేపట్టిన ఈ కార్యక్రమం రెండో దశలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్ గఢ్, గోవా రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టారు. మే 14న మూడో విడతకు తెర తీశారు. ఈ విడతలో దేశంలోని పదహారు రాష్ట్రాలు.. మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నారు. తాజాగా చేపట్టే రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్ని చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, ఢిల్లీ, చండీగఢ్, డయ్యూ డామన్ గా చెప్పాలి.

ఈ మూడో విడతను దశల వారీగా మొదలు పెట్టనున్నారు. ఈ విడతలో 36.73 కోట్ల మంది ఓటర్లను నిశితంగా పరిశీలించనున్నారు. మే 30తో మొదలయ్యే ఈ కార్యక్రమం అక్టోబరు 14వరకు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో జూన్ 15తో మొదలు కానుంది. అదే తెలంగాణలో మాత్రం జూన్ 25 నుంచి ప్రారంభం కానుంది. మూడో విడతలో దాదాపు 3.94 లక్షల మంది బూత్ లెవల్ అధికారులు, 3.42 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్ల సాయంతో ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేపడతారు. మూడో విడత పరిధిలోకి రాని రాష్ట్రాల విషయానికి వస్తే.. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లఢాఖ్ ప్రాంతాలు లేవు. దీనికి కారణంగా వాతావరణ పరిస్థితులుగా చెప్పాలి. మూడో దశను పూర్తి చేస్తే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పాలి.

ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ వోస్) ప్రతి ఇంటికి స్వయంగా వెళతారు. ప్రతి ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శించి.. లబ్దిదారుల సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. ఈ సందర్భంగా మరణించిన వారు.. శాశ్వితంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు.. ఒక వ్యక్తికి రెండు అంతకంటే ఎక్కువ చోట్ల ఉండే నకిలీ ఓటు గుర్తింపు కార్డుల్ని పూర్తిగా రద్దు చేసతారు. అదే సమయంలో 18 ఏళ్లు నిండిచన ప్రతి అర్హులైన యువతీయువకులకు ఓటర్లుగా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా జరిగేందుకు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నారు.

ఇక.. బూత్ స్థాయి సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు పూర్తి వివరాలు ఇవ్వని ఓటర్లతో పాటు.. 2002 జాబితాలో పేర్లు లేని ఓటర్లకు, జులై 31నుంచి సెప్టెంబరు 28 మధ్య కాలంలో నోటీసులు జారీ చేస్తారు. నిర్దిష్ట తేదీల్లో స్థానిక ఈఆర్ వో వద్ద విచారణకు పిలుస్తారు. అప్పుడు తమ అర్హతను రుజువు చేసే ఆధారాల్ని ఆయా ఓటర్లు సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారి ఓట్ల తొలగింపు జరుగుతుంది. సర్ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ లో రాజకీయంగా పెద్ద ఎత్తున వివాదానికి.. విమర్శలకు కారణమైంది. మరి.. తెలుగు రాష్ట్రాలతో పాటు మూడో విడతలో చేపట్టే రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.