Begin typing your search above and press return to search.

సుశాంక్ సింగ్ రాజ్ పుత్ ని గుర్తుచేసిన సౌమ్య శెట్టి.. లేటెస్ట్ వీడియో వైరల్!

ఈ నేపథ్యంలో ఈ కేసు పలు రకాల మలుపులు తిరుగుతుందనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో సౌమ్య శెట్టి తాజాగా ఒక వీడియో విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   25 March 2024 1:20 PM GMT
సుశాంక్  సింగ్  రాజ్  పుత్  ని గుర్తుచేసిన సౌమ్య శెట్టి.. లేటెస్ట్  వీడియో వైరల్!
X

విశాఖలోని ఒక రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కుమార్తెతో సౌమ్యశెట్టి పరిచయం పెంచుకుని, ఫలు దఫాలుగా వారి ఇంటి నుంచి సుమారు కిలో వరకూ బంగారం చోరీ చేసిందని, అనంతరం ఆ డబ్బుతో గోవాలో ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు పలు రకాల మలుపులు తిరుగుతుందనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో సౌమ్య శెట్టి తాజాగా ఒక వీడియో విడుదల చేశారు.

అవును... కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో కలకలం రేపిన బంగారం చోరీ కేసులో నిందితురాలిగా ఉన్న సౌమ్యశెట్టి తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా... "నామీద తప్పుడు కేసు పెట్టారు. లేనిపోని నిందలు వేశారు. రిమాండ్ లో లేకపోయినా రిమాండ్ లో ఉందని, జైల్లో ఉందని నాపై అసత్యప్రచారం చేశారు. జాతీయ స్థాయిలో నన్ను అన్ పాపులర్ చేశారు. నేను కూడా ఈ సొసైటీలో బ్రతకాలి కదా.. నేను కూడా నా వివరణ ఇచ్చుకోవాలి కదా" అని అన్నారు.

అనంతరం... సూసైడ్ చేసుకుని చనిపోదామనుకుంటే తన భర్త అడ్డుపడి.. ఫైట్ బ్యాక్ చేద్దామని చెప్పారని తెలిపారు సౌమ్య. ఇంతపెద్ద కేసు పెట్టినదాన్నే ఫైట్ బ్యాక్ చేస్తున్నప్పుడు.. మరికొన్ని అదనపు కేసులు అని అన్నారు. "మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు.. పవర్ ఉండొచ్చు.. అబద్ధాన్ని నిజం చేయొచ్చు.. కానీ, నన్ను భయపెట్టలేరు.. నాకు నిజంగానే ఇంక భయం పోయింది" అని తెలిపారు.

ఇదే సమయంలో... ఒక విషయంలో మాత్రం తనపై కేసులు పెట్టినవారికి థాంక్స్ చేబుతున్నట్లు తెలిపిన సౌమ్య... తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేషనల్ వైడ్ ఫేమస్ చేశారని అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన సమయంలో కూడా ఇలాగే... ఆయన డ్రగ్స్ కి బానిసయ్యాడు, పిచ్చెక్కిపోయాడు అని రకరకాల ప్రచారాలు చేశారు కానీ.. ఆయన మరణానికి అసలు కారణం ఏమిటనేది మాత్రం తేల్చలేకపోయారని తెలిపారు!!

ఇదే తరహాలో... తన మీద కూడా దొంగ అనే ముద్రవేసి జైలుకు పంపే ప్రయత్నం చేశారని.. కానీ అది జరగ లేదని.. ఏ తప్పూ చేయని తాను ఆ విషయాన్ని నిరూపించుకుంటానని.. చివరి ఊపిరి ఉన్నంతవరకూ వెనక్కి తగ్గేది లేదని ఆమె వెల్లడించారు.