Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీకి సోనియా అజెండా ఫిక్స్‌... విష‌యం హాట్ బ్రో!

దీనిపై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. అయితే, రోజులు గ‌డుస్తున్నా.. అజెండా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో నేరుగా సోనియా గాంధీనే అజెండా ఫిక్స్ చేసి

By:  Tupaki Desk   |   6 Sep 2023 10:36 AM GMT
ప్ర‌ధాని మోడీకి సోనియా అజెండా ఫిక్స్‌... విష‌యం హాట్ బ్రో!
X

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీ భారీ అజెండా ఫిక్స్ చేశారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంటు అత్య‌వ‌స‌ర స‌మావేశాల నేప‌థ్యంలో ఏకంగా మోడీకి సోనియా గాంధీ అజెండా ఫిక్స్ చేయ‌డం ఇప్పుడు పొలిటిక‌ల్‌గా హాట్ టాపిక్ అయింది. విష‌యం ఏంటంటే.. పార్ల‌మెంటు అత్య‌వ‌స‌ర స‌మావేశాలు అంటూ ప్ర‌క‌టించిన కేంద్రం.. దీనికి సంబంధించి అజెండా అంశాల‌ను మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

దీనిపై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. అయితే, రోజులు గ‌డుస్తున్నా.. అజెండా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో నేరుగా సోనియా గాంధీనే అజెండా ఫిక్స్ చేసి.. ప్ర‌ధాని మోడీకి పంపించారు. మొత్తం 9 అంశాలు పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు రావాల్సిందేన‌ని ఈ సంద‌ర్భంగా సోనియా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

సోనియా రాసిన లేఖ సారాంశం ఇదీ..

''విప‌క్ష‌ రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించారు. ఈ సమావేశాల అజెండా ఏంటో కనీస అవగాహన లేదు. మొత్తం ఐదు రోజుల పాటు ప్రభుత్వ అజెండాకే కేటాయించినట్లు మాకు తెలిసింది. అయితే వచ్చే సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని మేం కోరుతున్నాం'' అని లేఖలో పేర్కొన్నారు.

ఇవీ... సోనియా అజెండా అంశాలు!

+ అదానీ అక్రమాలు

+ మణిపుర్‌ అల్లర్లు

+ రైతు సమస్యలు

+ కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ

+ కులాల వారీగా జనగణన

+ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు

+ ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం

+ హరియాణా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు

+ చైనా ఆక్రమణలపై చర్చ