Begin typing your search above and press return to search.

మేఘాలయ బ్రాండ్ కు ముప్పుగా ఆమె దుర్మార్గం

ఒకరి కా*మవాంఛ ఒక రాష్ట్రానికి తలనొప్పిగా మారటమే కాదు.. ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేని తమపై పడ్డ మరకను తుడుచుకోవటానికి పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 9:35 AM IST
మేఘాలయ బ్రాండ్ కు ముప్పుగా ఆమె దుర్మార్గం
X

ఒకరి కా*మవాంఛ ఒక రాష్ట్రానికి తలనొప్పిగా మారటమే కాదు.. ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేని తమపై పడ్డ మరకను తుడుచుకోవటానికి పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. అవును.. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకొచ్చి.. భర్తను కిరాయి హంతకులతో చంపించిన భార్య సోనమ్ ఉదంతం.. మేఘాలయ టూరింజకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రకృతి అందాలతో ఈశాన్య భారతం ఎంత బాగుంటుందో తెలిసిందే. అయితే.. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే వారు తక్కువ. ఆయా రాష్ట్రాల ఆదాయ మార్గం టూరిజమే.

అయితే.. సోనమ్ కిరాతకం కారణంగా మేఘాలయ సేఫ్ కాదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడైతే భర్తను చంపేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన సోనమ్ చేసిన ప్లానింగ్.. ఆమె కన్నింగ్ ప్రపంచానికి తెలిసింది. ఈ కేసు వెలుగు చూసిన వేళ.. మేఘాలయ టూరిజం బ్రాండ్ ను రఘువంశీ దారుణ హత్య దెబ్బ తీసింది. పర్యాటకులకు కొత్త సందేహాల్ని వ్యక్గమైన పరిస్థితి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ కేసు విచారణను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టటమే కాదు.. అసలు వాస్తవాల్ని వెలుగు లోకి తీసుకొచ్చేందుకు విపరీతంగా శ్రమించింది. కేసు తీవ్రత తమ రాష్ట్ర పేరు ప్రఖ్యాతులను ఎంతలా దెబ్బ తీస్తుందన్న విషయాన్ని గుర్తించిన ముఘాలయ ముఖ్యమంత్రి సైతం నేరుగా ఈ హత్య ఉదంతంపై మాట్లాడటమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

ఇష్టం లేని పెళ్లిని వద్దని చెబితే సరిపోయే దానికి.. అందుకు భిన్నంగా తన తండ్రి మాటను కాదనకుండా.. ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం లేని భర్తను దారుణంగా హతమార్చాలన్న సోనమ్ కిరాతక మైండ్ సెట్ పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. భర్తను చంపేందుకు సోనమ్ చేసిన ప్లానింగ్ మొత్తం బయటకు వచ్చింది. అయినప్పటికీ ఈ ఉదంతం పుణ్యమా అని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే పర్యాటకుల్లో మాత్రం గుబులుగా మారిందంటున్నారు. మొత్తంగా సోనమ్ కామవాంఛ.. మేఘాలయ పర్యాటకాన్ని ప్రభావితం చేసిందని మాత్రం చెప్పక తప్పదు.