Begin typing your search above and press return to search.

మంత్రి పదవి మీద సోము ఫోకస్ ?

బీజేపీ సీనియర్ లీడర్ మాజీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మరోసారి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కావాలని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   20 July 2025 9:31 AM IST
మంత్రి పదవి మీద సోము ఫోకస్  ?
X

బీజేపీ సీనియర్ లీడర్ మాజీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మరోసారి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కావాలని అనుకున్నారు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం బీసీ నేత ఉత్తరాంధ్ర కు చెందిన పీవీఎన్ మాధవ్ వైపు మొగ్గు చూపారు. కాపులు కమ్మలు తరువాత బీసీల నుంచి కొత్త అధ్యక్షుడిని తేవాలని సామాజిక కోణంలో ఆలోచించారని అంటున్నారు.

దాంతో సోము వీర్రాజుకు కొంత నిరాశ తప్పలేదు. ఇక కేంద్ర బీజేపీ పెద్దలతో సోము వీర్రాజుకు మంచి సాన్నిహిత్యం ఉందన్నది తెలిసిందే. పైగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. దాంతోనే ఆయన ఎమ్మెల్సీ కాగలిగారు. అయితే ఇపుడు సోము వీర్రాజు ఆలోచనలు ఏపీ కేబినెట్ వైపుగా సాగుతున్నాయని అంటున్నారు.

ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం సాగుతోంది. అంతే కాదు బీజేపీకి ఈ దఫా మరో బెర్త్ ఖాయమని అంటున్నారు. దాంతో సోము వీర్రాజు మంత్రి పదవి మీద ఫోకస్ చేస్తున్నారు అని అంటున్నారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో రెండు సార్లు ఎమ్మెల్సీ తప్ప ఎలాంటి అధికార వైభోగాలను సోము వీర్రాజు అందుకోలేదు అని అనుచరులు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తారు. 2014 నుంచి 2019 మధ్యలోనే ఆయనకి మంత్రి పదవి రావాల్సి ఉందని కూడా అంటారు. కానీ అదే గోదావరి జిల్లా అదే సామాజిక వర్గానికి చెందిన పైడికొండల మాణిక్యాలరావుకు అవకాశం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో చూస్తే ఈసారి తనకు చాన్స్ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన గొంతు సవరిస్తున్నారు. జగన్ కి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుని పూర్తిగా సమర్ధిస్తున్నారు. చంద్రబాబుకు బనకచర్ల విషయంలో అంతా మద్దతు ఇవ్వాలని సోము తాజాగా పిలుపు ఇవ్వడం విశేషం.

అదే విధంగా బాబుకు ఏపీ తెలంగాణా రెండూ సమానమే అని కూడా ఆయన చెప్పారు. జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సోము లోకేష్ బాబు యువగళం లో ఏమి చేశారో గుర్తుకు తెచ్చుకోండని చినబాబు మీద కూడా అభిమానం చూపిస్తున్నారు. వేధింపులు కక్ష సాధింపులు అని వైసీపీ అనడం కాదని కేసులు ఎందుకు పెడుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఆయన వైసీపీని కోరుతున్నారు.

తన పర్యటనలను కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆయన నిందించారు. జగన్ ఎన్ని కలలు కన్నా అధికారం దక్కదని సోము జోస్యం చెప్పారు. మళ్ళీ కూటమి వస్తుందని కూడా అన్నారు. ఇలా సోము తన టోన్ మొత్తం సౌండ్ పెంచుతూ బాబుకు అనుకూలంగా మాట్లాడడంతో ఆయన ఆశలు వేరేగా ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు.

బీజేపీ ఒక బీసీ నేతకు మంత్రి పదవి ఇచ్చింది. అలా రాయలసీమ నుంచి సత్య కుమార్ యాదవ్ ఆ పదవిని అందుకున్నరు. ఈసరి గోదావరి జిల్లాకు చెందిన కాపు నేతకు చాన్స్ ఉండొచ్చని లెక్క వేస్తున్నారుట. ఎందుకంటే బీసీకి ఏపీ బీజేపీ కిరీటం ఇచ్చారు అని విశ్లేషిస్తున్నారు. మరి సోము ఆశలు తీరుతాయా బాబు కేబినెట్ లో మంత్రి అవుతారా అంటే వెయిట్ అండ్ సీ.