Begin typing your search above and press return to search.

ఇండియాలో సెకండ్ ప్లేస్ లో సోమాజీగూడ.. హైదరాబాద్ కు మరో ఖ్యాతి!

అవును... దేశంలోని అన్ని మాహానగరాల్లో మెరుగైన షాపింగ్‌ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్‌ మార్కెట్లలో హైదరాబాద్‌ లోని సోమాజిగూడ సెకండ్ పొజిషన్‌ లో నిలిచింది.

By:  Tupaki Desk   |   27 Aug 2023 5:25 AM GMT
ఇండియాలో సెకండ్  ప్లేస్  లో  సోమాజీగూడ.. హైదరాబాద్  కు మరో ఖ్యాతి!
X

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌ కు మరో ఖ్యాతి దక్కింది. దేశంలోని టాప్-10 హైస్ట్రీట్స్‌ లో సోమాజీగూడకు రెండు స్థానం దక్కింది. ఈ మేరకు నైట్ ఫ్రాంక్ ఇటీవల విడుదల చేసిన “ఇండియా రియల్ ఎస్టేట్ విజన్ 2047” నివేదిక ఈ విషయాలు వెల్లడించింది.

అవును... దేశంలోని అన్ని మాహానగరాల్లో మెరుగైన షాపింగ్‌ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్‌ మార్కెట్లలో హైదరాబాద్‌ లోని సోమాజిగూడ సెకండ్ పొజిషన్‌ లో నిలిచింది. సోమాజిగూడ, గచ్చిబౌలి, అమీర్‌ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ తో సహా టాప్ 30 హై-స్ట్రీట్ మార్కెట్‌ లలో హైదరాబాద్ ఐదు స్థానాలను దక్కించుకుంది.

ఈ లిస్టులో బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్డు మొదటి స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో ముంబైలోని లింకింగ్ రోడ్, ఢిల్లీ సౌత్ ఎక్స్‌టెన్షన్ - ఈ & ఈఈ, కోల్‌ కతా పార్క్ కామాక్ స్ట్రీట్ ఈ జాబితాలో హైదరాబాద్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో సర్వే నిర్వహించిన నైట్‌ ఫ్రాంక్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మధ్య కాలంలో రిటైల్‌ వ్యాపారరంగంలో పోటీతత్వం బాగా పెరిగిపోయిందని ఆ సంస్థ ఇండియా సీఎండీ.. అభిప్రాయపడ్డారు.

షాపింగ్‌ కు సోమాజిగూడ అత్యంత అనుకూలంగా ఉందని.. ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులకు స్థానిక రిటైల్‌ వ్యాపారులు కల్పిస్తున్న పార్కింగ్‌ వసతులు, ఇతర సౌకర్యాలు చాలా బాగున్నాయని నివేదికలో నైట్‌ ఫ్రాంక్ వెల్లడించింది.

ఈ క్రమంలోనే కొనుగోలుదారులకు మంచి షాపింగ్‌ అనుభూతిని ఇవ్వటమనేది చాలా కీలకంగా మారిందని వెల్లడించింది. అయితే.. అలాంటి మంచి షాపింగ్ అనుభూతి కలిగించే వీధులను హైస్ట్రీట్‌ లుగా గుర్తిస్తారని ఆ సంస్థ పేర్కొంది.