Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాకు 'డాక్సింగ్' ఎఫెక్ట్‌!

ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నియ‌మం. అయినా.. కొంద‌రు హ‌ద్దులు దాటేస్తున్నారు. ఇలాంటి వారిపై కేసు లు కూడా న‌మోదవుతున్నాయి

By:  Tupaki Desk   |   17 April 2024 7:45 AM GMT
సోష‌ల్ మీడియాకు డాక్సింగ్ ఎఫెక్ట్‌!
X

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండ‌డంతో అంద‌రూ యాక్టివ్‌గానే ఉంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌లు, ట్విట్ట‌ర్లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా గ్రామ్‌ల‌లో యువత మ‌రింత యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే.. ఎటొచ్చీ.. చిక్కేంటం టే.. అస‌భ్య క‌ర ప‌దాలు, దూష‌ణ‌ల జోలికి పోకుండా ఉంటే చాలు. అదేవిధంగా మ‌హిళ‌ల విష‌యంలోనూ అభ్యంత‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా ఉంటే చాలు. మ‌త‌ప‌ర‌మైన‌.. స‌మాజంలో చిచ్చుపెట్టేలా ఉన్న విష‌యాల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు పాటించాలి.

ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నియ‌మం. అయినా.. కొంద‌రు హ‌ద్దులు దాటేస్తున్నారు. ఇలాంటి వారిపై కేసు లు కూడా న‌మోదవుతున్నాయి. అయితే.. ఇప్పుడు మ‌రో విష‌యం కూడా వెలుగు చూసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా.. అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తే.. ఇది కూడా ఇబ్బందేనని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే.. డాక్సింగ్‌. ఈ విష‌యంలో క‌నుక జాగ్ర‌త్త‌గా లేక‌పోతే.. కోరిక ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంద‌ని చెబుతున్నారు.

ఏంటీ డాక్సింగ్‌?

మ‌న‌కు వాట్సాప్‌లోనో.. మ‌రో మాధ్యమంలోనో.. మ‌న‌కు తెలిసిన వారి.. తెలియని వారి వ్య‌క్తిగ‌త వివ‌రాలు షేర్ అయ్యాయ‌ని అనుకోండి. మ‌నం వాటిని చూసి వ‌దిలేయాలి. అలా కాకుండా.. వాటిని మ‌నం కూడా ఇత‌రుల‌కు షేర్ చేస్తే.. దానినే డాక్సింగ్ అంటారు. ఇలా.. ఒక‌రి వ్య‌క్తిగ‌త స‌మాచారం(ఫోన్ నెంబ‌ర్లు, ఈమెయిల్ ఐడీలు, పాన్‌, ఆధారం నెంబ‌ర్లు, ఇంటి అడ్ర‌స్‌, పిన్ కోడ్) మ‌రొక‌రికి ఎలాంటి అనుమ‌తి లేకుండా పంపిస్తే.. దీనిని నేరంగానే బావించాల్సి ఉంటుంది.

డిజిట‌ల్ మీడియా నియంత్ర‌ణ కోసం తీసుకువ‌చ్చిన ఐటీ చ‌ట్టంలో ప్ర‌త్యేకంగా దీనికి క్లాజ్ లేక‌పోయినా.. ఖ‌చ్చితంగా నిందితులు అని తేలితే.. అవ‌త‌లి పార్టీ క‌నుక సీరియ‌స్‌గా తీసుకుంటే.. ఇది నేరంగానే ప‌రిగ‌ణించి.. కేసులు పెట్టే అవ‌కాశం ఉంటుంది. సో.. ఫోన్ చేతిలో ఉందిక‌దా.. అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌|హ‌రించేవారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సి ఉంటుంది.