Begin typing your search above and press return to search.

వైరల్... ఇండియాలో మైనర్లను సోషల్ మీడియా బ్యాన్?

ఈ సమయంలో భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా ఆలోచిస్తుందని అంటున్నారు

By:  Tupaki Desk   |   7 Aug 2023 7:54 AM GMT
వైరల్... ఇండియాలో మైనర్లను సోషల్ మీడియా బ్యాన్?
X

ఈ మధ్య కాలంలో యువత, మరి ముఖ్యంగా మైనర్ బాలురు - బాలికలు సోషల్ మీడియా ప్రభావానికి లోనవుతున్నారనే చర్చ బలంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇంటర్ నెట్ యూసేజ్ మితిమీరడం.. సోషల్ మీడియా వాడకం పెరగడం వల్ల.. పిల్లల మానసిక పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఈ సమయంలో భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా ఆలోచిస్తుందని అంటున్నారు. పిల్లల శ్రేయస్సును కాపాడే ప్రయత్నంలో భాగంగా... 18 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వినియోగంపై సంభావ్య నిషేధానికి దారితీసే చర్యలను భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ తీవ్రంగా ఆలోచిస్తుందని అంటున్నారు.

అవును... మైనర్‌ లు తల్లిదండ్రుల స్పష్టమైన అనుమతి లేకుండా సోషల్ మీడియా ఖాతాలను ఆపరేట్ చేయకూడదని.. ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు, ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించే అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో ఎదురవుతున్న ఇబ్బందులు.. కొన్ని ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలకు ప్రతిస్పందనగా ప్రభుత్వానికి ఈ ఆలోచన వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న సైబర్ బెదిరింపుణలు, అనుచితమైన కంటెంట్‌ షేర్ చేయడం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

అయితే ఇలా తల్లితండ్రుల అనుమతి లేకుండా మైనర్ లతో సోషల్ మీడియాను ఆపించగలగడం సాధ్యమేనా అంటే... కాదనే వారే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. కారణం... ఇప్పటికే చాలా దేశాలు ఇలాంటి బిల్లులను ఆమోదించాయి కానీ.. వాటిని అమలు చేయడంలో అద్భుతంగా విఫలమవ్వడమే!

అయితే... యువత మానసిక ఆరోగ్యం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, సోషల్ మీడియా నిషేధాలు మాత్రమే పరిష్కారం కాదని ఈ సందర్భంగా మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికోసం సురక్షితమైన ఆన్‌ లైన్ నావిగేషన్‌ కు కీలకమైన క్లిష్టమైన ఆలోచన, గోప్యతా రక్షణ వంటి అవసరమైన నైపుణ్యాలను భారత ప్రభుత్వం పిల్లలకు అందించాలని అంటున్నారు.

కాగా... రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పిల్లల ఫోన్లలో మొబైల్ ఇంటర్నెట్‌ ను అనుమతించకూడదని చైనా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 2 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చైనా దేశం ఫిక్సయ్యింది. స్మార్ట్ ఫోన్లలో "మైనర్ మోడ్"ని ప్రవేశపెట్టాలని మొబైల్ ఫోన్ తయారీదారులను కూడా ప్రభుత్వం కోరింది.