Begin typing your search above and press return to search.

షాకింగ్ - 3089 కిలోల చరాస్, 158 కిలోల మెథామెఫ్తమైన్, 25 కిలోల మార్ఫిన్

ఇందులో భాగంగా గుజరాత్ లోని పోరుబందర్ తీరానికి నౌకను తరలించారు. ఇలా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తో భారత నౌకాదళం చేపట్టిన ఈ ఆపరేషన్ లో భారీ స్థాయిలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 7:44 AM GMT
షాకింగ్ -  3089 కిలోల చరాస్, 158 కిలోల మెథామెఫ్తమైన్, 25 కిలోల మార్ఫిన్
X

ఇటీవల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో ఒక స్మగ్లింగ్ రాకెట్ పట్టుబడింది. అరేబియా సముద్రంలోని భారత జలాల్లోకి అనుమాస్పదంగా ప్రవేశించిన ఒక చిన్నపాటి నౌకను వెంబండించిన అధికారులు దాన్ని ముట్టడించడంతో అందులో షాకింగ్ మెటీరియల్ కనిపించింది. దీనికి సంబంధించి భారత నౌకాదళం తాజాగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో... షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి.

వివరాళ్లోకి వెళ్తే... మంగళవారం అరేబియా సముద్రంలో అనుమాస్పదంగా ఒక చిన్నపాటి నౌక భారత జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఆ నౌకను గమనించిన భారత నౌకాదళం అధికారులు వెంటనే దాన్ని ముట్టడించారు. ఇందులో భాగంగా గుజరాత్ లోని పోరుబందర్ తీరానికి నౌకను తరలించారు. ఇలా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తో భారత నౌకాదళం చేపట్టిన ఈ ఆపరేషన్ లో భారీ స్థాయిలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

అవును... తాజాగా పట్టుకున్న నౌకను గుజరాత్ లోని పోరు బందర్ తీరానికి తీసుకొచ్చిన అధికారులు... అందులో సుమారు 3,300 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 3089 కిలోల చరాస్, 158 కిలోల మెథామెఫ్తమైన్, 25 కిలోల మార్ఫిన్ ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆ నౌకలో అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరంతా పాకిస్థాన్ జాతీయులని నౌకాదళం వెల్లడించింది.

ఇదిలా ఉండగా... కొద్ది రోజుల కిందట సుమారు రూ.2,500 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ ఎత్తున మ్యావ్ మ్యావ్ (మెఫెడ్రిన్) అనే డ్రగ్ ని పూణే నగరం నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ వద్ద కుర్ కుంభ సమీపంలోని ఓ ఫార్మాసూటికల్ ఫ్లాంట్ లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో భాగంగా ఈ ఫ్లాంట్ పట్టుబడిన డ్రగ్ బరువు 700 కిలోలు ఉండగా... మరోవైపు ఢిల్లీలో జరిపిన దాడుల్లో మరో 400 కిలోల మెఫెడ్రిన్ ని పట్టుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 2,500 కోట్లు ఉంటుందని చెబుతున్నారు! ఈ క్రమం లో తాజాగా ఏకంగా 3,300 కిలోల డ్రగ్స్ ని గుజరాత్ సమీపంలో పట్టుకున్నారు!